ICC Women's T20 World Cup 2024: బంగ్లాదేశ్‎కు షాక్.. యూఏఈ వేదిక‌గా మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌

ICC Women's T20 World Cup 2024: : మహిళల టీ20 ప్రపంచకప్ 2024 వేదికపై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రపంచకప్ ముందుగా బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉండగా, అక్కడ జరుగుతున్న హింసాకాండను దృష్టిలో ఉంచుకుని..ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

Written by - Bhoomi | Last Updated : Aug 20, 2024, 09:20 PM IST
ICC Women's T20 World Cup 2024:  బంగ్లాదేశ్‎కు షాక్.. యూఏఈ వేదిక‌గా మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌

ICC Women's T20 World Cup 2024 : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రోర్నమెంట్ ను ముందుగా బంగ్లాదేశలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులు ద్రుష్ట..ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్ వేదికలో పెద్ద మార్పు చేసింది. రాబోయే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ఇప్పుడు బంగ్లాదేశ్‌కు బదులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించాలని ఐసీసీ ప్రకటించింది.  బంగ్లాదేశ్‌లో టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం సాధ్యంకాని పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ టోర్నమెంట్ UAEలో నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. 

బంగ్లాదేశ్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వకపోవడం నిరాశ కలిగించిందని, ఈ ఈవెంట్‌కు అవసరమైన అన్ని సన్నాహాలను బీసీబీ పూర్తి చేసిందని ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డైస్ తన ప్రకటనలో తెలిపారు. అయితే ఆటగాళ్లు, దేశాల ప్రతినిధిలు బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాయి. బంగ్లాదేశలో టోర్నమెంట్ కు హాజరుకాలేమని తేల్చిచెప్పడంతో..ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ టోర్నమెంట్ అక్టోబర్ 3 నుండి 20 వరకు దుబాయ్, యూఏఈలోని షార్జాలో జరుగుతుంది. ఈ ఈవెంట్‌ను నిర్వహించడానికి సపోర్ట్ చేసిన  శ్రీలంక, జింబాబ్వేలకు ఐసిసి కృతజ్ఞతలు తెలిపింది. భవిష్యత్తులో ఈ రెండు దేశాలలో ఐసిసి ఈవెంట్‌లను నిర్వహించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

Also Read : Ambani success story:  అంబానీయా మజాకా.. సొంత కాళ్ల మీద 20 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన అనిల్ అంబానీ కుమారుడు

ఇక ఈమధ్యకాలంలో క్రికెట్ కు ఎక్కువగా  యూఏఈ ఆతిథ్యం ఇస్తోంది. ఎందుకంటే యూఏఈ ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉంది. ఇలాంటి పెద్ద టోర్నమెంట్స్ నిర్వహించడం సాధ్యం అవుతుంది. యూఏఈ 2021లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌తో సహా గతంలో అనేక ప్రధాన క్రికెట్ టోర్నమెంట్‌లను విజయవంతంగా నిర్వహించింది. మొత్తానికి ఈ నిర్ణయం మహిళా క్రికెట్  ఈ పెద్ద ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించడానికి ముందడగు పడినట్లు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. యూఏఈలో ఈ టోర్నీ నిర్వహించడం వల్ల క్రికెట్‌కు ఆదరణ పెరగడమే కాకుండా ఆటగాళ్లకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని చెబుతున్నారు.

Also Read : Daggubatis: దగ్గుబాటి కుటుంబం శోభిత ధూళిపాలను ఇంకా యాక్సెప్ట్ చేయలేదా.. సమంతనే ఫాలో అవుతున్న రానా, వెంకీ మామ  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News