సౌత్ ఇండియాలో అర్జున్ రెడ్డి ప్రభంజనం అంతా ఇంతా కాదు..ఇది జగమెరిగిన సత్యం. అయితే ఇది చూసిన బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఈ మూవీని రీమేక్ చేసి కబీర్ సింగ్ గా విడుదల చేశారు. తెలుగు అర్జున్ రెడ్డికి తరహానే కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం సృష్టిస్తోంది. కేవలం ఐదే ఐదు రోజుల్లో ఈ చిత్రం వంద కోట్ల ( 104.9 కోట్ల ) క్లబ్ లోకి చేరింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు తరణ్ ఆదర్శ్ తన ట్వీట్‌లో తెలిపారు.
తొలి రోజు ఈ చిత్రం రూ.20.21 కోట్లు (శుక్రవారం), రెండో రోజు రూ.22.71 కోట్లు (శనివారం) మూడో రోజు రూ.27.91 కోట్లు (ఆదివారం), నాల్గో రోజు రూ.17.54 కోట్లు (సోమవారం) , ఐదో రోజు 16.53 కోట్లు (మంగళవారం) వసూళ్లు రాబట్టినట్లు పేర్కొన్నారు. ఈ మూవీ షాహిద్ కపూర్ కెరియర్‌లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా కబీర్ సింగ్ నిలవడం గమనార్హం..
#KabirSingh cruises past ₹ 💯 cr... Shahid Kapoor scores his first *solo* century... Extraordinary trending on weekdays... Eyes ₹ 130 cr+ total in Week 1... Fri 20.21 cr, Sat 22.71 cr, Sun 27.91 cr, Mon 17.54 cr, Tue 16.53 cr. Total: ₹ 104.90 cr. India biz. BLOCKBUSTER.
— taran adarsh (@taran_adarsh) June 26, 2019
దేశ వ్యాప్తంగా ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో తొలి రోజు కలెక్షన్లలో సల్మాన్ ఖాన్ నటించిన 'భారత్' మూవీ 42.30 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, కళంక్ 21.60 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో కేసరి ( 21.06 కోట్లు) ఉంది. కబీర్ సింగ్ నాలుగో స్థానం (20.21 )లో నిలవడం విశేషం. అమెరికాలోను ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్న క్రమంలో థియేటర్ల సంఖ్య పెంచారట. బాహుబలి తర్వాత టాలీవుడ్ కు చెందిన కథాంశం బాలీవుడ్ ఈ స్థాయిలో విజయవంతం అవడం గమనార్హం.