విజయవాడ: బందర్ పోర్టు తెలంగాణకు అప్పగింతపై వచ్చిన వార్తా కథనాన్ని ఆధారం చేసుకొని జగన్ సర్కారపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఈ రోజు చేతకాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. పరిపాలించడం చేతకావట్లేదని రేపు పాలన కూడా రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడతారా? అంటూ జగన్ సర్కార్ తీరును లోకేష్ ఎద్దేవ చేశారు.
ఒక్క ఛాన్స్ ఎందుకు అడిగారు ?
పాలించడం చేతగాని అసమర్థులు ప్రజలకు ఒక్క ఛాన్స్ ఎందుకు అడిగారని లోకేష్ ప్రశ్నించారు. రాష్ట్రానికి దోచుకోడానికా? ప్రజల భవిష్యత్తును పక్క రాష్ట్రాలకు తాకట్టుపెట్టడానికా ? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఈరోజు చేతకాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడతారా? ఇలాంటి అసమర్థులు ఒక్క ఛాన్స్ ఎందుకోసం అడిగారు? దోచుకోడానికా? ప్రజల భవిష్యత్తును పక్క రాష్ట్రాలకు తాకట్టుపెట్టడానికా? pic.twitter.com/WVt4pLsqn4
— Lokesh Nara (@naralokesh) July 29, 2019
బందర్ పోర్టుతో ఉపాధి అవకాశాలు !!
బందర్ పోర్టును తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే పోర్టు అభివృద్ధి జరిగి స్థానికులను ఉపాధి అవకాశాలు వస్తాయని..పైగా చుట్టుపక్కల పరిశ్రమలు ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ మేరకు స్పందించారు.