ఏపీ బాటలోనే పయనించేందుకు కర్ణాటక సర్కార్ సిద్ధమౌతోంది. ఇంకో రకంగా చెప్పాంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అడుగుజాడల్లో నటిచేందుకు కర్ణాటక సీఎం యూడియురప్ప సిద్ధమౌతున్నారు. ఏంటా బాట..? ఎంటా అడుగు జాడలు..? అనేదే గా మీ ప్రశ్న .. అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతోంది.
ఆంధ్రప్రదేశ్ లోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని జగన్ సర్కార్ చట్టం చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఆదర్శంగా తీసుకున్న కర్నాటక సీఎం యాడియూరప్ప ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కర్ణాటకలో మెజారిటీ ఉద్యోగాలు కన్నడిగులకే దక్కాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు. ఈ విషయంలో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ముందుకు పోతామని యడియూరప్ప చెప్పారు. కర్ణాటకలోని ఉద్యోగాలు కన్నడిగులకే అనే హ్యాష్ ట్యాగ్ ను తన ట్వీట్ కు జతచేశారు.
కర్నాటక ట్వీట్ పై టిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కన్నడీలు దీన్ని స్వాగతిస్తుంటే .. ఇతర ప్రాంతాల వారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కొందరు దీన్ని మాటల్లో కాదు ఆచరణలో చేసి చూపించాలని సీఎం యాడియూరప్పకు సవాల్ విసురుతున్నారు. ఇదిలా ఉంటే తాజా కామెంట్స్ పై బెంగళూరలో స్థిరపడ్డ తెలుగు వారితో పాటు ఇతర ప్రాంతాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ಕನ್ನಡದ ನೆಲದಲ್ಲಿ ಕನ್ನಡಿಗರಿಗೆ ಉದ್ಯೋಗ ಹೆಚ್ಚು ಸಿಗಬೇಕು ಎನ್ನುವುದೇ ನಮ್ಮ ಸರ್ಕಾರದ ಆಶಯ. ಸರ್ಕಾರದ ನೀತಿಯೂ ಸಹಾ ಈ ನಿಟ್ಟಿನಲ್ಲಿದೆ.
ಈ ನೆಲದ ಭಾವನೆಗಳನ್ನು ನಾವು ಸದಾ ಗೌರವಿಸುತ್ತೇವೆ.
ರಾಜ್ಯದ ಜನರ ಭಾವನೆಗಳಿಗೆ ಧಕ್ಕೆಯಾಗದಂತೆ ನೋಡಿಕೊಳ್ಳುವ ಭರವಸೆ ನೀಡುತ್ತೇವೆ.#KarnatakaJobsForKannadigas
— CM of Karnataka (@CMofKarnataka) August 11, 2019