Jani Master: జానీ మాస్టర్ కంటే ముందు లైంగిక ఆరోపణలతో జైలు జీవితం గడిపిన కొరియోగ్రాఫర్ తెలుసా..

Jani Master: జానీ మాస్టర్ కేసులో విచారణ వేగం అందుకుంది. ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే కదా.అయితే  జానీ మాస్టర్ కంటే ముందు లైంగిక ఆరోపణలతో జైలు జీవితం గడిపిన కొరియోగ్రాఫర్ ఒకరున్నారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 19, 2024, 11:54 AM IST
Jani Master: జానీ మాస్టర్ కంటే ముందు లైంగిక ఆరోపణలతో జైలు జీవితం గడిపిన కొరియోగ్రాఫర్ తెలుసా..

Jani Master:మహిళ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ పై ఏడేళ్లుగా జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణల నేపథ్యంలో అతని పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. లైంగిక వేధింపు ఆరోపణల నేపథ్యంలో సినీ పరిశ్రమ అతన్ని కొరియోగ్రాఫర్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న అతన్ని ఇమిడియేట్ గా సస్పెండ్ చేసింది.  జానీ మాస్టర్ తనను కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇస్తానని చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు సదురు లేడీ కొరియోగ్రాఫర్ తన కంప్లైంట్ లో పేర్కొంది. అంతేకాదు మైనర్ గా ఉన్న సమయంలో తనను ముంబైలో ని హోటల్లో తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో శ్రేష్ఠ వర్మ పేర్కొంది.  దీంతో జానీ మాస్టర్ పై  పోలీసులు అతనిపై పోక్సో యాక్ట్ కింద్ కేసు నమోదు చేసారు.  అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ పోలీసులకు  దేశంలోని నలుమూలకు వెళ్లారు. ఎట్టకేలకు బెంగళూరులో సైబరాబాద్ SOT పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు అతన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు అతన్ని విచారించనున్నారు. కేవలం ఈమె మాత్రమేనా.. ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో ప్రశ్నించనున్నారు.

జానీ మాస్టర్ అరెస్ట్ నేపథ్యంలో అతని కంటే ముందు తెలుగులో వేటగాడు, యుగంధర్, యమగోల, కొండవీటి సింహం, బొబ్బిలిపులి, ప్రేమాభిషేకం, ఖైదీ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన సలీమ్ మాస్టర్ కూడా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే లైంగిక వేధింపులు మరియు ఓ హత్య కారణంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.  ఆ తర్వాత అతని కెరీర్ మొత్తం నాశనం అయింది. అప్పటి వరకు పెద్ద పెద్ద బంగాళాలో తిరిగిన అతను  చివరి సమయంలో చిన్న అద్దె ఇంట్లో ఉంటూ పూటకు లేక అడుక్కుతిని మరి చనిపోయాడు. ఆయన జీవితం ఎంతో మందికి గుణపాఠం అని చెప్పాలి.  

జానీ మాస్టర్ టాలీవుడ్, కోలీవుడ్  సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా  తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు గెలుచుకున్నాడు.  తాజాగా ఈయన పై లైంగిక వేధింపుల ఆరోపణలపై  ముందుగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఆ తర్వాత ఈ కేసును నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.  కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు  మహిళా కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ (21) పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాదు జానీ మాస్టర్ హీరోగా.. శ్రేష్ఠ వర్మ హీరోయిన్ గా ‘యథా రాజా తథా ప్రజా’ అనే సినిమా కూడా మొదలైంది. ప్రస్తుతం ఈ
చిత్రం షూటింగ్ దశలో ఉంది. తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి జానీ మాస్టర్ పాల్పడినట్టు చెప్పింది. అంతేకాదు జానీ మాస్టర్ తను మతం మారేలా అతని భార్యతో కలిసి తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు కూడా తెలిపింది. దీంతో హిందూ సంఘాలు దీన్ని లవ్ జిహాద్ కేసు కింద కేసు నమోదు చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.

జానీ మాస్టర్ .. సదురు లేడీ కొరియోగ్రాఫర్ పైగా చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో సాంగ్స్ కోసం అవుట్‌డోర్ షూటింగ్ లకు వెళ్లినపుడల్లా తనపై అత్యాచారానికి పాల్పడే వాడని చెప్పింది. అంతేకాదు   నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు తనపై  లైంగిక వేధింపులకు పాల్పడ విషయాన్ని కూడా ప్రస్తావించింది.  పాల్పడ్డాడని మహిళ కొరియోగ్రాఫర్ తన  ఫిర్యాదులో పేర్కొంది. గతంలో 2015లో ఓ కాలేజీలో  మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ స్థానిక సెషన్స్   కోర్టు జానీ మాస్టర్ కు ఆరు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా జానీ మాస్టర్  లో మార్పు రాలేదని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News