Telangana Heavy Rains: ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. కొన్ని జిల్లాల్లో వరదలు కూడా వచ్చి పడ్డాయి. అయితే వారం రోజుల్నించి ఎలాంటి వర్షాలు లేకపోవడమే కాకుండా ఉష్ణోగ్రత పెరిగి తీవ్ర ఉక్కపోత వేధిస్తోంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ నుంచి మరో అలర్ట్ జారీ అయింది.
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం, హైదబాదాద్, వరంగల్ జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లింది. ఇక మరోసారి వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలో రేపట్నించి భారీ వర్షాలు పడనున్నాయి. రేపట్నించి రానున్న మూడు రోజులు తెలంగాణలోని చాలా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో అదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నిజామాబాద్, జనగామ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 22 వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ జిల్లాల్లో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 24వ తేదీన అల్పపీడనం ఏర్పడి అది కాస్తా తుపానుగా మారవచ్చని ఐఎండీ స్పష్టం చేసింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో మల్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. గత వారం రోజుల్నించి తీవ్ర వక్కపోతతో భాదపడుతున్న ప్రజానీకానికి కాస్తంత ఊరట కలగనుంది. అదే సమయంలో భారీ వర్షాలు పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కూడా ఐఎండీ సూచించింది.
Also read: Tirumala Laddu Dispute: తిరుమల లడ్డూ వివాదమేంటి, నిజంగానే కొవ్వు ఉపయోగిస్తున్నారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.