Hidden Camera: మరో గుడ్లవల్లేరు ఘటన.. అమ్మాయిల బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా.?.. స్టూడెంట్ ఫోన్ లో వేలాది న్యూడ్ వీడియోలు..

Hidden camera in wash room: కంబిపూర్ ఏసీఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో కొంత మంది అమ్మాయిలు బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాను గమనించారు. దీంతో వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు. ఈ ఘటన మాత్రం ఇంజనీరింగ్ కాలేజీలో పెనుదుమారంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 20, 2024, 07:51 PM IST
  • కర్ణాటకలో షాకింగ్ ఘటన..
  • ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫోన్ లో న్యూడ్ వీడియోలు..
Hidden Camera:  మరో గుడ్లవల్లేరు ఘటన.. అమ్మాయిల బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా.?.. స్టూడెంట్ ఫోన్ లో వేలాది న్యూడ్ వీడియోలు..

Hidden camera issue in acs college karanataka: కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మైసూరు రోడ్డులోని కంబీపూర్‌లోని ఏసీఎస్ కాలేజీలో ఈ దారుణం చోటుచేసుకుంది. కాలేజీ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలను కొంత మంది అమ్మాయిలు గమనించారు. దీనిపై వెంటనే కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు, అమ్మాయిలు నిరసనలు చేపట్టారు.

ఇదిలా ఉండగా.. పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ ఉన్న హిడెన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. దీనిలో కుశాల్ అనే ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కారణమని కూడా బైటపడింది. అతని ఫోన్ లు, ల్యాప్ టాప్ లను పరిశీలించగా.. వేల కొలది న్యూడ్ వీడియోలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ఘటన కన్నడ నాట పెనుదుమారంగా మారింది. దీంతో కాలేజీలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కుశాల్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు వచ్చి కాలేజీ వద్ద నిరసనలకు దిగాయి. కాలేజీ యాజమాన్యం వద్దకు అమ్మాయిల తల్లిదండ్రులు చేరుకుని ఘటనపై మండిపడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more: Viral Video: బాబోయ్..ఒళ్లు గగుర్పోడిచే ఘటన.. మహిళను చుట్టేసుకున్న 13 అడుగుల భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..

అయితే.. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో గుడ్లవల్లేరు  కాలేజీలో కూడా వాష్ రూమ్ లో.. యువతుల బాత్రూమ్ లో ఇలాంటి హిడెట్ కెమెరా ఘటన తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. అక్కడ కూడా.. ఒక యువతి తన లవర్ కోసం.. అమ్మాయిల బాత్రూమ్ లో.. సీక్రెట్ కెమెరాలను పెట్టినట్లు ప్రచారం జరిగింది.  దీనిపైన ఏపీ సీఎం చంద్రబాబు ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. అంతేకాకుండా.. విద్యార్థినులకు న్యాయం చేయాలని కూడా పలు సంఘాలు, కాలేజీకి చేరుకుని తమ నిరసలను సైతం తెలిపాయి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News