Saripodha Sanivaram OTT News: నాని ‘సరిపోదా శనివారం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..

Saripodha Sanivaram OTT Streaming Date Fix: నాచురల్ స్టార్ నాని  హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగింపుకు వచ్చేసింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 21, 2024, 01:27 PM IST
Saripodha Sanivaram OTT News: నాని ‘సరిపోదా శనివారం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..

Saripodha Sanivaram OTT Streaming Date Fix: నాని వరుస హిట్స్ తో దూకుడు మీదున్నాడు. నెగిటివ్ టాక్ తో కూడా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. తాజాగా ఈయన కథానాయకుడిగా ‘సరిపోదా శనివారం’ మూవీతో పలకరించాడు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో   తెరకెక్కిన ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో నష్టాలను చవి చూసింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో వరదల వల్ల ఈ సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. మరోవైపు ప్యాన్ ఇండియా మూవీ అంటూ హంగామా చేసినా.. ఇతర భాషల్లో మాత్రం ఈ సినిమా సోదిలో లేకుండా పోయింది.

మిగతా భాషల్లో ‘సరిపోదా శనివారం’ సినిమాకు పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. ఈ సినిమాలో సూర్య పాత్రలో నాని నటనకు మంచి మార్కలే పడ్డాయి. అతనికి ఢీ కొట్టే విలన్ పాత్రలో సూర్య అంతకు మించి తన నటనను ప్రదర్శించాడు.  కోపాన్ని అణుచుకునే వ్యక్తి పాత్రలో అద్భుతంగా నాని ఒదిగిపోయన తీరు బాగుంది. కేవలం వారంలో శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగింపుకు వచ్చింది. వచ్చే వారం ‘దేవర’తో పూర్తిగా థియేటర్స్ నుంచి ఈ సినిమా ఎత్తేయనున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమా 5 భాషలకు సంబంధించిన హక్కులు కొనుగోలు చేసారు. ఈ నెల 26 నుంచి ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రానుంది.

సరిపోదా శనివారం ఇప్పటి వరకు వచ్చిన వసూళ్ల విషయానికొస్తే..
 ఈ సినిమా తెలంగాణ (నైజాం).. రూ. 15.03 కోట్లు
రాయలసీమ (సీడెడ్).. రూ. 3.92 కోట్లు
మిగిలిన ఆంధ్ర ప్రదేశ్.. రూ. 12.67 కోట్లు..

మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ.31.62 షేర్ (రూ. 53.95 కోట్ల గ్రాస్) కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 7.17 కోట్లు..
ఓవర్సీస్ .. రూ. 12.36 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా రూ. 51.15 కోట్ల షేర్ (95.55 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ లో 100 శాతం రికవరీ అయింది. ఓవరాల్ గా విదేశాల్లో , రెస్ట్ ఆఫ్ భారత్ లో ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో  తెలంగానలో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది. మిగతా ఏపీ, రాయలసీమలో ఎక్కడ లాభాల్లోకి రాలేదు. ఓవరాల్ బిజినెస్ మీద ఈ సినిమా రూ. 10 కోట్ల వరకు లాభాలను ఆర్జించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News