Hyderabad Rain : హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉన్నట్లుండి కురిసిన కుండపోత వర్షానికి నగరమంతా అతలాకుతలం అయ్యింది. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురుగాలులు వీయడంతో పరిస్థితి భయానకంగా మారింది. రహదారులన్నీ చెరువులను తలపించాయి. భారీ వర్షానికి వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో వాహనదారులు నరకం చూశారు. పలు చోట్ల తీవ్ర ట్రాఫిక్ జామ్ అయ్యింది. కరెక్టుగా ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరే సమయంలోనే భారీ వర్షం కురిసింది. దీంతో చాలా మంది ఉద్యోగులు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు.
బషీర్ బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి, నారాయణగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, నారాయణగూడ, లక్డీకపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్ , ఎస్ఆర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, సుచిత్ర, అల్వాల్, ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Also Read: SSY: సుకన్య సమృద్ధి యోజన ద్వారా అమ్మాయి పేరిట 50 లక్షలు పొందాలంటే ఏం చేయాలి?
వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. నగర వ్యాప్తంగా మరో గంటపాటు వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దంటూ హెచ్చరించింది జీహెచ్ఎంసీ.
@revanth_anumula @GHMCOnline @TelanganaCMO it's been almost 2 and half year's no improvement in drainage line's and no road improvement they come they dig holes and go away whole route is worst in kothapet SRL colony... #HyderabadRains pic.twitter.com/cWNHPBpFSi
— nikhil maisheri (@NMaisheri) September 21, 2024
Stuck in Malakpet #HyderabadRains @balaji25_t @HiHyderabad @Hyderabadrains @HiHyderabad pic.twitter.com/zHOnHnguFD
— Mohammed Farzan Ahmed (@FarzanHyderabad) September 21, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.