LIC: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ నుంచి బంపర్ ఆఫర్.. రోజుకు రూ. 100 సిప్ చేసేలా కొత్త స్కీం షురూ

Daily Rs.100 SIP : ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్, సిప్ చేసే కనీస పెట్టుబడి మొత్తాన్ని తగ్గించే యోచనలో ఉంది. ప్రస్తుతం మినిమం సిప్ అమౌంట్ రూ. 300గా ఉంది. దీన్ని ఇప్పుడు రూ. 100కి తగ్గించాలని కంపెనీ భావిస్తోంది.   

Written by - Bhoomi | Last Updated : Sep 25, 2024, 09:16 PM IST
LIC: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ నుంచి బంపర్ ఆఫర్.. రోజుకు రూ. 100 సిప్  చేసేలా కొత్త స్కీం షురూ

LIC Mutual Fund: మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా పెట్టుబడి పెట్టినట్లయితే ఈ వార్త మీకోసమే. LIC మ్యూచువల్ ఫండ్ ద్వారా కొత్త  SIP ప్రారంభించాలని  కంపెనీ భావిస్తోంది. ఈ సిప్ అమౌంట్ రూ. 100 నుంచి ప్రారంభం కానుంది. మైక్రో SIPని ప్రోత్సహించడానికి, రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి SEBI  ఈ చొరవలో ఇది భాగంగా చెప్పుకోవచ్చు. ఈ మార్పు అమలైతే రోజువారీ SIP మొత్తం రూ.300 నుంచి రూ.100కి తగ్గుతుంది. ఇది కాకుండా, నెలవారీ SIP మొత్తం ప్రస్తుతం కనిష్టంగా రూ.1,000 ఉంది. ఇది రూ.250కి తగ్గుతుంది.

100 రూపాయల SIP పెట్టుబడిని పెంచుతుంది:

ఎల్‌ఐసి మ్యూచువల్ ఫండ్ ద్వారా రోజుకు రూ. 100 సిప్‌ను తీసుకురావడం వల్ల పెట్టుబడి మరింత సులభతరం చేయడంతోపాటు మరింత సౌకర్యవంతంగా చేయడంలో ఒక పెద్ద ముందడుగు అని ఆనంద్ రాఠీ వెల్త్ లిమిటెడ్ మ్యూచువల్ ఫండ్స్ హెడ్ శ్వేతా రజనీ అన్నారు. తక్కువ మొత్తంతో SIP ప్రారంభించడం ద్వారా పెట్టుబడి పెట్టే వ్యక్తులు పెద్ద డబ్బు సంపాదించవచ్చు. అయితే, మంచి రాబడిని చూడటానికి మీరు ప్రతిరోజూ పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. నెలవారీ SIPతో మీరు మంచి రాబడిని కూడా పొందవచ్చు.

Also Read: Success Story : అసాధ్యం అనే పదానికి అర్థం తెలియని సుసాధ్యుడు.. జీ మీడియా అధినేత సుభాష్ చంద్ర జీవన ప్రస్థానం

రోజువారీ SIP, నెలవారీ SIP మధ్య రాబడిలో చాలా తక్కువ వ్యత్యాసం ఉంది:

రోజువారీ SIP, నెలవారీ SIP మధ్య చాలా తక్కువ వ్యత్యాసం ఉంది. రెండింటి మధ్య దాదాపు 0.1 శాతం తేడా ఉంది. కాబట్టి, నెలవారీ SIP చేస్తున్న పెట్టుబడిదారులు నెలవారీ SIP లో మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిది. ఎల్‌ఐసి మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభిస్తున్న  రూ. 100 రోజువారీ SIP ఆదాయం తక్కువగా ఉన్న వారికి మంచి అవకాశం అని చెప్పవచ్చు. చిన్న దుకాణదారులు లేదా ఉపాధి ఉన్న యువత ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. తమ డబ్బును సరిగ్గా ఖర్చు చేయాలనుకునే వారికి కూడా ఇది మంచిది.

పెట్టుబడి పెట్టే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని శ్వేతా రజనీ అన్నారు. పెట్టుబడి పెట్టడానికి ముందు, ఈ పెట్టుబడి మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అవి స్వల్పకాలిక లేదా దీర్ఘకాలికమైనవి కావచ్చు. ఇది కాకుండా, రిస్క్‌ని బ్యాలెన్స్ చేయడానికి, మీ పెట్టుబడులను వివిధ మార్కెట్ క్యాప్ కేటగిరీలుగా విభజించండి. మీ రాబడులు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అధిగమించడమే మీ లక్ష్యమని తెలిపారు. 

Also Read: New Rules From October: అక్టోబర్‌ 1 నుంచి 5 కొత్త రూల్స్‌.. ఏమిటీ ఆ భారీ మార్పులు ముందుగానే తెలుసుకోండి..

కాగా సిప్ లిమిట్ ను రూ. 100కి తగ్గించడం వల్ల చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు మంచి అవకాశం లభిస్తుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. ఈ చిన్న ఎంట్రీ పాయింట్ దేశం అంతటా, ముఖ్యంగా చిన్న పట్టణాలు, నగరాల్లో మ్యూచువల్ ఫండ్స్ ను మరింత యాక్సెస్ అందిస్తుందని, పాపులర్ ఆప్షన్ గా మారుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News