Flipkart Apologise: పురుషులను కించపరిచిన ఫ్లిప్‌కార్ట్‌.. నెటిజన్ల దెబ్బకు దిగివచ్చి క్షమాపణలు

Flipkart Apologised Promotional Video Of Women Bags: తన అమ్మకాల కోసం ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ పురుషులను కించపరుస్తూ దారుణమైన వీడియో రూపొందించింది. నెటిజన్ల దెబ్బకు దిగి వచ్చి క్షమాపణలు చెప్పి వీడియో తొలగించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 27, 2024, 06:59 PM IST
Flipkart Apologise: పురుషులను కించపరిచిన ఫ్లిప్‌కార్ట్‌.. నెటిజన్ల దెబ్బకు దిగివచ్చి క్షమాపణలు

Flipkart's Big Billion Days Sale: తన వ్యాపారం కోసం ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఒక వర్గానికి కించపరుస్తూ వీడియో తీసింది. సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపడంతో దెబ్బకు దిగి వచ్చింది. ఆ వీడియోపై క్షమాపణలు ప్రకటించి వెంటనే డిలీట్ చేసింది. మహిళలకు సంబంధించిన హ్యాండ్‌బ్యాగ్‌ల విషయమై ప్రకటన చేస్తూ భర్తలను ఆ వీడియోలో తిట్టి పోసింది. వెధవలు అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది.

Also Read: Lepakshi: 'లేపాక్షి'లో క్షుద్రపూజలు.. 'పొలిమేర'లో కలకలం

ఏం జరిగింది?
దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ తన బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో మహిళలను ఆకట్టుకునేందుకు ఓ యానిమేటెడ్‌ వీడియో తీసి తన వస్తువులను ప్రమోట్‌ చేసింది. భర్తలకు తెలియకుండా హ్యాండ్‌బ్యాగ్‌లు కొనుగోలు చేసి ఎలా దాచి ఉంచాలో వివరిస్తూ 55 సెకన్ల వీడియో ఉంది. మీ పనికిమాలిన భర్త.. వెధవ అంటూ తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ ఆ వీడియోలో ఉండడం తీవ్ర దుమారం రేపింది.

Also Read: Friends Stabbed: ప్రాణం తీసిన 'మొబైల్‌ ఫోన్‌' పార్టీ.. దావత్‌ ఇవ్వలేదని తోటి స్నేహితులే

భర్తలను తిట్టి పోయడంపై సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పురుషులతోపాటు మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లిప్‌కార్ట్‌ను తిట్టిపోశారు. 'మీ బ్యాగ్‌ల వ్యాపారం కోసం మా భర్తలను తిడతారా' అంటూ మహిళలు మండిపడ్డారు. ఈ వీడియోను పురుషుల హక్కుల సంఘం స్పందించింది. ఇలాంటి వీడియో తీసి ఒక వర్గం మనోభావాలను దెబ్బతీశారని మండిపడింది. వెంటనే క్షమాపణలు చెప్పి వీడియోను డిలీట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది.

నెట్టింట తీవ్ర దుమారం ఏర్పడడంతో ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ స్పందించింది. ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేసింది. 'ఇలాంటి వీడియో వచ్చినందుకు మేం చింతిస్తున్నాం. తప్పు మాదేనని అంగీకరించాం. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతాం' అని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇతరులను కించపరచడమేమిటని ఫ్లిప్‌కార్ట్‌ రగడ ఇంకా తగ్గలేదు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News