హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల వైఖరిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ ఉద్యోగుల అంశంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ''ప్రభుత్వాన్ని ఉద్యోగులు డిక్టేట్ చేయలేరని.. ప్రభుత్వం నిర్ధేశించిన పనులనే ఉద్యోగులు చేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. ‘‘కుక్క తోకను ఊపుతుందా? లేక తోకే కుక్కను ఊపుతుందా?’’ చెప్పండంటూ ఉద్యోగుల తీరుపై సీఎం కేసీఆర్ ఛలోక్తులు విసిరారు.
ఈ సందర్భంగా పలు ఉద్యోగ సంఘాల వారు సమ్మెలు చేయడాన్ని సీఎం కేసీఆర్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ''ఎవరో చెప్పిన పిచ్చి మాటలు నమ్మి సమ్మెలు చేయడం సరికాదు" అని ఉద్యోగులకు హితవు పలికారు.