Kannappa: మంచు విష్ణు ప్యాన్ ఇండియా సినిమా నుండి బ్రహ్మానందం ఫస్ట్ లుక్ విడుదల

Kannappa Posters: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా మీద అంచనాలు పెంచడంలో.. చిత్ర బృందం బాగానే కష్టపడుతోంది అని చెప్పుకోవచ్చు. ప్రతి వారం సినిమా నుండి ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తున్న చిత్ర బృందం తాజాగా సినిమా నుండి.. బ్రహ్మానందం, సప్తగిరి పాత్రలను పరిచయం చేస్తూ.. ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 30, 2024, 05:46 PM IST
Kannappa: మంచు విష్ణు ప్యాన్ ఇండియా సినిమా నుండి బ్రహ్మానందం ఫస్ట్ లుక్ విడుదల

Brahmanandam and Saptagiri from Kannappa: విష్ణు మంచు కెరియర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమా కన్నప్ప సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.  ప్రతీ సోమవారం ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉందన్న సంగతి తెలిసిందే. ఈ రకంగా సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. సినిమా మీద హైప్ కూడా బాగానే పెరుగుతోంది. 

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కన్నప్ప నుంచి చాలా పోస్టర్లు బయటకు వచ్చాయి. ప్రముఖ నటీనటులు సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. వారి పాత్రలకి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి మరొక ఇద్దరి లుక్స్ ను బయటపెట్టింది చిత్ర బృందం.

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ కమెడియన్ సప్తగిరి కూడా సినిమాలో చిన్న పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా సినిమాలో వారి కార్టెక్టర్లను రివీల్ చేస్తూ ఒక పోస్టర్ ఇవాళ విడుదలైంది. బ్రహ్మానందం ఈ సినిమాలో పిలక పాత్రలో.. సప్తగిరి గిలక పాత్రలో కనిపించనున్నారు. వారి పేర్ల లాగానే వారి పాత్రలు కూడా సినిమాలో మంచి కామెడీ పండిస్తాయి అని చెప్పుకోవచ్చు.

చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట.. నేర్పిన గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే.. అంటూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సినిమాలో వీళ్ళిద్దరూ గురువులుగా కనిపించనున్నారు అని వీరి పాత్రలను అందరికీ పరిచయం చేశారు. వీరిద్దరి కామెడీ సినిమాకి మంచి అట్రాక్షన్ అయ్యేలాగానే కనిపిస్తోంది. 

ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్, తిన్నడు ఉపయోగించే గుర్రం టిక్కి, మారెమ్మ పాత్రలకు సంబంధించిన లుక్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. విడుదల తేదీ గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Also Read: MP Dharmapuri Arvind: కాంగ్రెస్ ఆ హామీ చూసి నాకే ఓటు వేయాలనిపించింది.. ఎంపీ ధర్మపురి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 

Also Read: Hyderabad to Ayodhya Flight Service: రామభక్తులకు అదిరిపోయే శుభవార్త..  భాగ్య నగరం నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News