Mobiles Under 10000: అమెజాన్‌లో 5000mAh బ్యాటరీ పోకో C65 మొబైల్‌ రూ.6 వేలకే.. మరెన్నో ఆఫర్స్‌ కూడా..

Mobiles Under 10000 In Amazon: పోకో C65 స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసేవారికి నో కాస్ట్ EMI ఆప్షన్‌ కూడా లభిస్తోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 3, 2024, 03:32 PM IST
Mobiles Under 10000: అమెజాన్‌లో 5000mAh బ్యాటరీ పోకో C65 మొబైల్‌ రూ.6 వేలకే.. మరెన్నో ఆఫర్స్‌ కూడా..

 

Mobiles Under 10000 In Amazon: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,799కే పొందాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఇటీవలే మార్కెట్‌లోకి అందుబాటులో వచ్చిన పోకో మొబైల్స్‌ డెడ్ చీప్‌ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా కంపెనీ వీటిని ప్రత్యేకమైన బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో కూడా విక్రయిస్తోంది. గతంలో అందుబాటులోకి వచ్చిన పోకో C65 మొబైల్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది.  గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఈ పోకో C65 స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో రెండు స్టోరేజ్‌లతో పాటు మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇది 4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర MRP రూ.10,999 కాగా అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివెల్‌ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 38 శాతం తగ్గింపుతో కేవలం రూ.6,799కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌ వినియోగించాలనుకునేవారు కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డతో పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. ఇక ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, ఈ POCO C65 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌ పే ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా లభిస్తుంది. ఇక ఎక్చేంజ్‌ ఆఫర్‌ను ఉపయోగించి ఈ కొత్త మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.6,350 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ఆఫర్స్‌ అన్ని పోనూ POCO C65 స్మార్ట్‌ఫోన్‌ను రూ.449కే పొందవచ్చు.

Also Read: Discount Offer: అమెజాన్‌లో 5000mAh బ్యాటరీ సాంసంగ్‌ మొబైల్‌ పై రూ.6,100 డిస్కౌంట్.. ఎలా కొనాలంటే!

పోకో C65 స్మార్ట్‌ఫోన్‌ టాప్ ఫీచర్లు:
6.74 ఇంచెస్ డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేటు
శక్తివంతమైన ఆక్టా-కోర్ ప్రాసెసర్‌
5000mAh భారీ బ్యాటరీ
18W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌
50MP ప్రధాన కెమెరా
1TB వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌
స్టైలిష్ డిజైన్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్

Also Read: Discount Offer: అమెజాన్‌లో 5000mAh బ్యాటరీ సాంసంగ్‌ మొబైల్‌ పై రూ.6,100 డిస్కౌంట్.. ఎలా కొనాలంటే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News