విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్ లో 136 ఓవర్లు ఆడిన భారత్ 502/7 పరుగుల చేసి ఇన్నింగ్ ను డిక్లేర్డ్ చేసింది. యువ ఓపెనర్ యమాంక్ అగర్వార్ (215) డబుల్ సెంచరీ తో కదం తొక్కడం, రోహిత్ శర్మ(176) పరుగులతో రాణించడంతో ఈ మేరకు భారీ స్కోర్ సాధపడింది. రడేజా 30 పరుగులు, సాహా 21, కోహ్లీ 20, రహానే 15 పరుగులతో తమ వంతు సహాకారం అందించారు.
ఇక సౌతాఫ్రికా బ్యాటింగ్ విషయానికి వస్తే ఒత్తిడిలో బ్యాటింగ్ కు దిగిన సఫారీ జట్టు 10 ఓవర్లు ఎదుర్కొని ఒక వికెట్ కోల్పోయి 20 పరుగులు చేసి ఎదురీదుతోంది. సఫారీలు భారీ స్కోర్ చేయడం అలా ఉంచితే...అసలు ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కాలంటే ఆ జట్టుకు మరో 282 పరుగులు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేతిలో 9 వికెట్లు మాత్రమే ఉన్నాయి. భారత బౌలింగ్ కు తట్టుకొని సఫారీ బ్యాట్స్ మెన్లు ఏ మేరకు రాణించాస్తారనేది చూడాల్సి ఉంది.