Tollywood: పవన్ విషయంలో స్పందించలేదు.. సామ్ విషయంలో స్పందిస్తున్నారు.. కారణం అదేనా..!

Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీ ఎపుడు ఒకటిగా ఉన్న దాఖలాలు లేవు. అదే తమిళనాడులో జల్లికట్టు, కావేరి నీళ్లు సహా వాళ్ల ప్రాంత సమస్యలు ఏమున్న ముందుండి స్పందిస్తుంటారు. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ రకమైన ఐక్యత ఉండదనే టాక్ ఉంది. తాజాగా సమంత, నాగ చైతన్య ఇష్యూలో మాత్రం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఏకం అయింది. కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ విషయంలో జరిగితే సినీ ఇండస్ట్రీ స్పందించిన దాఖలాలు లేవు.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 4, 2024, 01:19 PM IST
Tollywood: పవన్  విషయంలో స్పందించలేదు.. సామ్ విషయంలో  స్పందిస్తున్నారు.. కారణం అదేనా..!

Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంత విషయంలో అంతా ఒక్కటై స్పందించిన తీరు మాత్రము అభినందించి తీరాలి. అయితే.. సమంత విషయంలో సినీ ఇండస్ట్రీ స్పందించిన తీరుకు.. పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విషయంలో ఎందుకు స్పందించలేదనే విషయం ఇపుడు చర్చకు వచ్చింది. ఇక సామ్ మరియు అక్కినేని ఫ్యామిలీ విషయంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందించడానికి కారణం.. వీరికి రాజకీయాలతో అనుబంధం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి, ఏపీలో వైసీపీ కి  అనుకూలంగా వ్యవహరించినా.. వారికీ ఓటెయ్యాలని ఎపుడు అక్కినేని నాగార్జున పిలుపు నివ్వలేవు. అటు సమంత కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో అందిరీ హీరోలతో ఆమె నటించడం కారణంగా ఆమె అంటే అందరికీ గౌరవం ఉంది.

మొత్తంగా అక్కినేని ఫ్యామిలీ వివిధ రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్నా.. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు డైరెక్ట్ గా ప్రకటించకుండా హుందా వ్యవహరిస్తూ వచ్చారు. అదే ఇపుడు వారి ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు పేలితే అంతా ఒక్కటయ్యారు.

అదే పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. ఆయన రాజకీయాల్లో ఉన్నారు. అందుకే ఆయన్ని పొలిటికల్ గా పోసాని, రోజా  వంటి వారు తిట్టినా.. ఇండస్ట్రీ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. పైగా మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఈ ఇష్యూను ఖండించిన దాఖలాలు లేవు. ఒకవేళ ఖండిస్తే.. ఆయా నటులకు మైలేజ్ ఇచ్చినట్టు అవుతుంది.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

మరోవైపు నారా భువనేశ్వరిని వైసీసీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడినా.. ఏదో కొంత మంది మాత్రమే ఖండన చేసారు. వాళ్ల ఫ్యామిలీపై రాజకీయంగా దాడి చేసారు. అంతకు ముందు ఇదే టీడీపీ అనుకూల సోషల్ మీడియా వాళ్ల షర్మిలకు టాలీవుడ్ లో మరో బడా ప్యాన్ ఇండియా స్టార్ కు ఏదో ఎఫైర్ ఉన్నట్టు పుకార్లు లేపారు. మొత్తంగా అప్పట్లో వీళ్లంత రాజకీయంగా ఒకరిపై ఒకరు బురద చల్లుకునే ప్రయత్నం చేసారు. ఈ రకంగా వీళ్లపై మాటల దాడి జరిగినా.. ఎందుకు వచ్చిన తంటా అనుకొని సైలెంట్ గా ఉండిపోయారు. మొత్తంగా పవన్ విషయంలో సైలెంట్ గా ఉండడానికి.. సమంత విషయంలో స్పందించడానికి కారణం అదే అని చెబుతున్నారు.

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News