Balakrishna: హిందూపురంలో బాలయ్యకు ఝలక్..

Balakrishna: తెలుగు దేశం పార్టీ  ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు సోంత నియోజకవర్గం హిందూపురంలోనే బిగ్ షాక్ తగిలింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీలో చేరిన నలుగురు కౌన్సిలర్లు.. తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 8, 2024, 11:34 AM IST
 Balakrishna: హిందూపురంలో బాలయ్యకు ఝలక్..

Balakrishna Big Shock: తెలుగు దేశం పార్టీ అగ్ర నేత సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యకు తన నియోజకవర్గంలో పెద్ద షాక్ తగిలింది. అయితే..తెలుగు దేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాలయ్య హిందూపురంలోని కొంత మంది వైసీపీ కౌన్సిలర్లు.. అభివృద్ధిలో భాగంగా బాలయ్య సమక్షంలో తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకున్నారు. కానీ పార్టీలో చేరిన తర్వాత తన ప్రాంత అభివృద్ధిలో ఎలాంటి పురోగతి లేకుండా పోవడంతో టీడీపీ కండువా కప్పుకున్న నలుగురు కౌన్సిలర్లు తిరిగి తమ సొంత గూటికి  చేరుకున్నారు.

ఈ సందర్భంగా వైసీపీలోకి వెళ్లిన కౌన్సిలర్లు మాట్లాడుతూ.. అభివృద్ది కోసం పార్టీ మారితే.. తమను పట్టించుకోవడం లేదు. అంతేకాదు తమ ప్రాంత అభివృద్ది పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారన్నారు. పార్టీ మారిన తర్వాత కూడా అభివృద్ది శూన్యం అన్నారు. వైపీసీ వైసీపీ ఇంచార్జ్ దీపిక భర్త వేణురెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు నలుగురు కౌన్సిలర్లు. వైసీపీలో చేరినవారిలో కౌన్సిలర్స్‌ మణి, రహమత్‌ బీ, మల్లికార్జున, పరుశురాం ఉన్నారు.

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే.. గత ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2014లో తొలిసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన బాలయ్య.. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోను హిందూపురం నుంచి గెలవడం గమనార్హం. తాజాగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో  కూటమి తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా హాట్రిక్ నమోదు చేసారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య.. బాబీ దర్శకత్వంలో 109 సినిమా చేస్తున్నాడు. దసరా సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని డిసెంబర్ చివరి వారంలో విడుదల చేస్తారా.. ! సంక్రాంతి బరిలో నిలుస్తుందా అనేది చూడాలి.

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

Trending News