మహిళలు ఉదయం ఇంట్లో పనులు చేసుకొని ఆఫీస్ కు వెళుతుంటారు. ఆఫీస్ లో రోజూ ఏడెనిమిది గంటలు పని చేస్తారు. సాయంత్రం ఇంటికి రాగానే అలసటతో చిరాకు పడుతుంటారు. అమ్మా..! తినటానికి ఏదైనా చేయి అని పిల్లలు అడిగితే చికాకు పడుతుంటారు.మహిళలు ఆఫీసులో పనిచేస్తూ రిలాక్స్ గా ఉంటే సాయంత్రం ఇంటికి రాగానే హుషారుగా, చలాకీగా కనిపిస్తారు. పిల్లలకూ స్నాక్స్ మాదిరి ఏదైనా చేసిపెడతారు. కాబట్టి మహిళలు ఆరోగ్యం మీద దృష్టి సారించాలి. ఏదో కష్టపడే వ్యాయామం చేయాలని కాదు. సింపుల్ గా ఉండే ఆరోగ్య చిట్కాలను ప్రయత్నించండి అని.
* రోజూ అరగంట నడవండి. అలాగే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లకు లిఫ్ట్ ఎక్కే బదులు కాలినడకన మెట్లు ఎక్కండి. శరీరానికి వ్యాయామం అందుతుంది.
* మహిళల్లో గుండె వేగం నిమిషానికి 75-80 ఉండాలి. కనుక యోగా చేయాలి. డంబెల్స్ తో కూడా వ్యాయామం చేయాలి. ఈ తరహా వ్యాయామాలు చేస్తే గుండెకు అందాల్సిన రక్తం సరఫరా అయి ఆరోగ్యంగా ఉంటారు.
* కంప్యూటర్ ముందు కూర్చొని ఉద్యోగం చేసే మహిళల్లో ఎక్కువగా చేతివేళ్ల నొప్పితో బాధపడతారు. అలాంటి సమస్య ఉన్నవారు జుట్టుకు ఉన్న రబ్బరుబ్యాండ్ తీసుకోవాలి. కుడి, ఎడమ చేతివేళ్లను దగ్గరకు చేర్చి బ్యాండ్ వేయాలి. బ్యాండ్ ను సాగదీస్తూ వేళ్లను దూరంగా దగ్గరకు చేజరపాలి. ఇలా 10-15 నిమిషాలపాటు చేయాలి.
* కుర్చీలో కూర్చునా లేదా నిలబడినా నిటారుగా ఉండాలి. కంప్యూటర్ స్క్రీన్ కంటికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మెడ, వెన్ను నొప్పులు రావు.
* ఉదయంపూట టిఫిన్ నిర్లక్ష్యం చేయకూడదు. అలానే ఆఫీస్ టైమింగ్స్ లో టీ, కాఫీ, గ్రీన్ టీ వంటివి సేవించాలి. తగినంత మంచినీళ్లు తాగుతూ ఉండాలి. రోజూ తీసుకొనే ఆహారంలో తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవాలి. తినటానికి టైం లేకుంటే ఆఫీసుకు తీసుకెళ్లి కూడా తినవచ్చు.
జాబ్ కు వెళ్తున్నారా? ఈ చిట్కాలు పాటించండి