దుమ్మురేపుతున్న 'అల వైకుంఠపురములో..' సాంగ్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'అల వైకుంఠపురములో..' ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు దుమ్మురేపుతున్నాయి.

Last Updated : Dec 26, 2019, 12:20 PM IST
దుమ్మురేపుతున్న 'అల వైకుంఠపురములో..' సాంగ్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'అల వైకుంఠపురములో..' ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు దుమ్మురేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అభిమానులకు ఈ పాటలు కిక్కెస్తున్నాయి. ఆన్లైన్లో విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమా యూనిట్ కూడా ఉత్సాహంగా ఉంది. సినిమా నుంచి ఇప్పటి వరకు నాలుగు పాటలు ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. అందులో 'రాములో రాముల' పాట 11 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది.

క్రేజీ సాంగ్.. 'బుట్టబొమ్మ..బుట్టబొమ్మ'
సినిమాలో పాటలు ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లుగా ఉన్నాయి. డిసెంబర్ 24న విడుదలైన 'బుట్టబొమ్మ..బుట్టబొమ్మ' మ్యూజిక్ లవర్స్ను అలరిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే 40 లక్షల వ్యూస్ సొంతం చేసుకుందంటే .. పాట ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ గీత రచయిత  రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ  పాటను అర్మాన్ మాలిక్ పాడారు.

జనవరి 12 సినిమా విడుదల
సంక్రాంతి బరిలో నిలిచిన 'అల వైకుంఠపురములో..' సినిమా కోసం అల్లు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే టాకీపార్ట్ అంతా పూర్తయింది. సినిమాకు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకత్వ వహిస్తున్నారు.

Read Also: అల వైకుంఠపురములో..బుట్ట బొమ్మ సాంగ్ టీజర్

Trending News