MLC Jeevan Reddy: జీవన్ రెడ్డి వెనుక ఆ కీలక నేత.. సీఎం రేవంత్‌పై నేరుగా గురి..!

Telangana Politics: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిపై ఓ సీనియర్‌ లీడర్‌ గుర్రుగా ఉన్నారా..! తనకు పదవి దక్కలేదని రేవంత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారా..! ప్రస్తుతం పార్టీలో అసంతృప్తులను కలుపుకుని రేవంత్‌పై తిరుగుబాటు చేసేందుకు సిద్దమయ్యారా..! ఇంతకీ ఎవరా నేతా.. ఆయనకు ఎందుకు అంతలా అసంతృప్తి..!   

Written by - G Shekhar | Last Updated : Oct 28, 2024, 06:44 PM IST
MLC Jeevan Reddy: జీవన్ రెడ్డి వెనుక ఆ కీలక నేత.. సీఎం రేవంత్‌పై నేరుగా గురి..!

Telangana Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఎపిసోడ్‌ హీట్ పుట్టిస్తోంది. జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చేరికను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న జీవన్‌ రెడ్డి.. తాజాగా తన అనుచరుడి హత్యకు ఎమ్మెల్యేనే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. రోజుకో మలుపు తిరుగుతున్న జగిత్యాల పాలిటిక్స్‌.. ఇప్పుడు జీవన్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించే వరకు చేరుకున్నాయి. సీఎం రేవంత్‌ను ఇరుకున పెట్టేందుకు జీవన్‌ రెడ్డి రాజీనామా అస్త్రాన్ని సంధించారని గాంధీ భవన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే జీవన్‌ రెడ్డి వెనుకుండి డైరెక్షన్‌ చేసింది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్డే అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.. 

Also Read: Share Market : భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ. 6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద.. కారణాలు ఇవే
 
తాజాగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని మధుయాష్కీ గౌడ్‌ కలిశారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లా జాబితాపూర్ గ్రామంలో ఇటీవల హత్యకు గురైన గంగారెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. ఇక ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తమ అక్రమ ఆస్తులతోపాటు తమ రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సంచలన కామెంట్స్‌ చేశారు మధుయాష్కీ గౌడ్‌. దాంతో ఒక్కసారిగా మధుయాష్కీ గౌడ్‌ తెరమీదకు వచ్చినట్టు అయ్యింది. ఇటీవల టీపీసీసీ చీఫ్‌ పదవి కోసం మధుయాష్కీ గౌడ్‌ చివరి నిమిషం వరకు పోటీ పడ్డారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్‌ గౌడ్‌ వైపు మొగ్గు చూపడంతో  ఆయనకే పదవి దక్కింది. అప్పటినుంచి సీఎం రేవంత్‌ రెడ్డిపై మధుయాష్కీ గౌడ్‌ గుర్రుగా ఉన్నారు. తనకు అవకాశం దొరికితే రేవంత్‌ను ఇరకాటంలో పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నారట. ఇటీవల హైదరాబాద్‌లో మూసీ కూల్చివేతల బాధితులను పరామర్శించిన మధు యాష్కీగౌడ్‌.. సీఎం వైఖరిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయబోతున్నట్టు చెప్పడం హాట్ టాపిక్‌ అయ్యింది. 
 
ఇక టీపీసీసీ చీఫ్ పదవి చేజారి పోయాక.. రేవంత్‌ రెడ్డితో అంటిముట్టనట్టుగానే మధు యాష్కీ ఉంటున్నారు. తన మాధిరి అసంతృప్తితో ఉన్న నేతలను ఏకం చేసి జట్టు కట్టాలని ప్రయత్నిస్తున్నాడనే ప్రచారం ఉంది. ఇప్పుడు జీవన్‌ రెడ్డి రచ్చ వెనుక మధు యాష్కీ గౌడ్‌ ఉన్నారని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం జీవన్‌ రెడ్డి ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. జీవన్‌ రెడ్డి పట్టువీడటం లేదు.. ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారనే టాక్ సైతం వినిపిస్తోంది. ఆయన త్వరలోనే కమలం పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే జీవన్‌ రెడ్డిని బయటకు పంపి రేవంత్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాలనే ప్రయత్నంలో మధు యాష్కీ గౌడ్‌ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.. 
 
మొత్తంగా జీవన్ రెడ్డి ఏపిసోడ్‌ వెనుక మధుయాష్కీ ఉన్నారన్న ప్రచారంపై టీపీసీసీ సైతం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వివాదాన్ని కావాలనే సృష్టిస్తే మాత్రం చర్యలు తప్పకపోవచ్చనే ప్రచారం సైతం జరుగుతోంది. చూడాలి మరి జీవన్ రెడ్డి ఏపిసోడ్‌కు కాంగ్రెస్‌ పెద్దలు తెరదించుతారా.. లేదంటే మధుయాష్కీ ఎంట్రీతో ఈ అంశం మరింత  హీటెక్కుతుందా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

Also Read: Secretariat: సోషల్‌ మీడియాలో లైక్‌లు, పోస్టులు, కామెంట్లు చేయొద్దు.. పోలీసులకు ప్రభుత్వం వార్నింగ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook

Trending News