అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చరితారెడ్డి మృతదేహం హైదరాబాద్‌కు చేరింది. ఇవాళ శంషాబాద్ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నేరెడ్‌మెట్‌లోని ఆమె స్వగృహానికి తరలించారు. డిసెంబర్ 27న అమెరికాలోని మిచిగావ్‌లో చరితా రెడ్డి కారులో వెళ్తుండగా .. ఓ వ్యక్తి మరో కారుతో వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో చరితారెడ్డి ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం అంతా నుజ్జునుజ్జయింది. కారులో కూర్చున్న ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమె మృతి చెందారు.
ఫేస్‌బుక్ వేదికగా క్రౌడ్ ఫండింగ్
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చరితారెడ్డి మృతదేహం హైదరాబాద్ కు తరలించేందుకు ఆమె స్నేహితులు సాయం చేశారు. ఇందుకోసం అయిన ఖర్చులను ఫేస్‌బుక్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించారు. దీంతో ఆమె పార్ధీవ దేహం హైదరాబాద్‌కు తరలించడం సాధ్యమైంది.
హైదరాబాద్‌కు మృతదేహం రావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..