ముంబై: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగవంతంగా (115వ ఇన్నింగ్స్‌ల్లో) 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆసీస్ క్రికెటర్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ రెండో బంతిని డీప్ బ్యాక్ వర్డ్ స్క్వైర్ లెగ్ దిశగా బౌండరీకి తరలించి 11పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఘనత సాధించాడు వార్నర్. గతంలో ఈ రికార్డు డీన్ జోన్స్ (128 ఇన్నింగ్స్) పేరిట ఉండేది. తాజా మైలురాయితో వేగవంతంగా వన్డేల్లో 5వేల మైలురాయి చేరుకున్న ఆసీస్ క్రికెటర్‌గా వార్నర్ నిలిచాడు.
David Warner becomes the fourth-fastest to 5000 ODI runs, reaching the milestone in 115 innings 👏 https://t.co/588dUNeDuQ #INDvAUS pic.twitter.com/b6gHvqYye6
— ESPNcricinfo (@ESPNcricinfo) January 14, 2020
ఓవరాల్‌గా వన్డేల్లో అత్యంత వేగంగా ఈ పీట్ సాధించిన ఆటగాళ్లల్లో నాలుగో స్థానంలో నిలిచాడు వార్నర్. దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా కేవలం 101 ఇన్నింగ్స్‌ల్లో 5వేల వన్డే పరుగుల మార్క్ చేరుకోవడం విశేషం. విండీస్ దిగ్గజం వీవ్ రిచర్డ్స్ (114 ఇన్నింగ్స్), ఛేజింగ్ మాస్టర్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (114 ఇన్నింగ్స్) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వార్నర్ తాజా రికార్డుతో 116 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ చేరుకున్న ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ 5వ స్థానానికి పడిపోయాడు.
Also Read: కోహ్లీ విఫలం.. ఓ మోస్తరు స్కోరుకే టీమిండియా ఆలౌట్
కాగా, 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 140 పరుగులు చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 255పరుగులకే ఆలౌటైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..