ముంబై: వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ, వన్ డౌన్‌లో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ మాత్రమే రాణించడంతో టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. పాట్ కమిన్స్, కేన్ రిచర్డ్ సన్ చెరో రెండు వికెట్లు తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు 5వ ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (10)ని మిచెల్ స్టార్క్ పెవిలియన్ చేర్చాడు.
అనంతరం క్రీజులోకొచ్చిన రాహుల్ (47; 61 బంతుల్లో 4 ఫోర్లు)తో కలిసి ధావన్ (74; 91 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో ధావన్ 66 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే సెంచరీ భాగస్వామ్యం(121 పరుగులు) తర్వాత హాఫ్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో రాహుల్‌ను అష్టన్ అగర్ ఔట్ చేశాడు. మరో ఆరు పరుగుల తర్వాత పాట్ కమిన్స్ బౌలింగ్ లో షాట్ ఆడేందుకు యత్నించిన ధావన్ అష్టర్ అగర్ క్యాచ్‌కు పెవిలియన్ బాట పట్టాడు.
Also Read: పింక్ బాల్ టెస్ట్‌కి రెడీ: విరాట్ కోహ్లీ
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఓ స్థానం కిందకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (16) ఓ సిక్స్ కొట్టి పరవాలేదనిపించాడు. అయితే జంపా బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. ఆ తర్వాతి ఆటగాళ్లలో కేవలం రిషభ్ పంత్(28; 33 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా(25; 32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) పరవాలేదనిపించారు. చివర్లో కుల్దీప్ (17; 15 బంతుల్లో 2 ఫోర్లు) బ్యాట్ ఝులిపించడంతో భారత్ స్కోరు 250 దాటింది. మహ్మద్ షమీ (10)ని కేన్ రిచర్డ్ సన్ ఔట్ చేయడంతో 49.1ఓవర్లలో భారత్ 255 పరుగుల వద్ద ఆలౌటైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..