Fruit For Diabetes: డయాబెటిస్ ఉన్నవారు పండ్లు తినాలా వద్దా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. పండ్లలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణమైనప్పుడు గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలిసిపోతాయి. కొన్ని పండ్లలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా పండ్లు తినవచ్చు, కానీ జాగ్రత్తగా ఉండాలి. అన్ని పండ్లు ఒకేలా ఉండవు. కొన్ని పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువగా పెంచుతాయి, మరికొన్ని ఎక్కువగా పెంచుతాయి. అయితే ఎలాంటి పండ్లును తినడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది అనేది తెలుసుకుందాం.
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం. ఇది బరువు తగ్గాలనేవారు తినవచ్చు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలు మనల్ని ఎక్కువ సేపు పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలు శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. యాపిల్, పెయిర్ , స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీలు, ఆవకాడో వంటి పండు తినాలి. అంజీర్లు, ద్రాక్ష, చిలగడదుంపలు, మామిడి, అరటి, తేనె చక్కెర పండ్లు తీసుకోకుండా ఉండాలి. ఇందులో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి షుగర్ లెవెల్స్‌ను పెంచుతాయి.
ఏ పండు తినాలన్నా పరిమాణం చాలా ముఖ్యం. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో పండ్లు తినకూడదు. భోజనం తర్వాత పండ్లు తినడం మంచిది. పండ్లను ఇతర ఆహారాలతో కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగకుండా తగ్గిస్తుంది. ఏ పండ్లు తినాలి, ఎంత తినాలి అనేది ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీ వైద్యుడిని సంప్రదించి మీకు సరైన ఆహార పథకాన్ని రూపొందించుకోండి.
డయాబెటిస్ ఉన్నవారు ఏ పండ్ల రసాలు తాగవచ్చు?
తక్కువ చక్కెర గల పండ్ల రసాలు: నిమ్మరసం, ద్రాక్షపండు రసం వంటివి తక్కువ చక్కెర గల పండ్ల రసాలు. అయినప్పటికీ, వీటిని కూడా తక్కువ పరిమాణంలో మాత్రమే తాగాలి.
పూర్తి పండ్లను తినడం: పండ్ల రసాలకు బదులుగా పూర్తి పండ్లను తినడం మంచిది. ఎందుకంటే, పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
తక్కువ పరిమాణంలో తాగాలి: ఒక గ్లాసు పండ్ల రసం తాగిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయి ఎలా ఉంటుందో గమనించాలి.
చక్కెర కలిపిన పండ్ల రసాలను నివారించాలి: చక్కెర కలిపిన పండ్ల రసాలను తాగకూడదు.
డయాబెటిస్ ఉన్నవారు ఏ పండ్ల రసాలు తాగాలో, ఎంత పరిమాణంలో తాగాలో వైద్యుని సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.