న్యూఢిల్లీ: ట్వంటీ20 ప్రపంచ కప్ కోసం భారత మహిళల జట్టు సిద్ధమవుతోంది. హర్యానా బ్యాటింగ్ యువ సంచలనం షఫాలీ వర్మ ఇటీవల టీ20 ప్రపంచ కప్ 15 మంది సభ్యులలో ఎంపికైన విషయం తెలిసిందే. దాదాపు 30 ఏళ్ల కిందట అతిపిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ హాఫ్ సెంచరీ చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న రికార్డును కొన్ని రోజుల కిందట తన పేరిట లిఖించిచుకున్న ఉమెన్ క్రికెటరే ఈ షఫాలీ. సచిన్ నుంచి ప్రేరణ పొంది క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న షఫాలీ అతడి రికార్డునే తిరగరాసింది. త్వరలో మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది.
Also Read: టీ20 వరల్డ్ కప్‌నకు భారత జట్టు ఎంపిక
అతిపిన్న వయసులో టీ20 ప్రపంచ కప్ ఆడనున్న భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసేందుకు షఫాలీ సిద్ధమైంది. ఇందుకోసం నెట్స్‌లో కఠోర సాధన చేస్తోంది ఈ 15 ఏళ్ల యువ క్రికెటర్. 9ఏళ్ల బ్యాట్ పట్టిన షఫాలీ అనూహ్యంగా ఈ కెరీర్లోకి అడుగుపెట్టిందట. తన సోదరుడు అనారోగ్యంతో మ్యాచ్‌కు దూరం కాగా అబ్బాయి మాదిరిగా టీ షర్ట్ ధరించి సబ్‌స్టిట్యూట్‌గా మ్యాచ్ ఆడింది షఫాలీ. సచిన్‌ను స్ఫూర్తిగా తీసుకుని.. పట్టుదల, కఠోర శ్రమతో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంత ఎదిగినా మూలాలను మాత్రం మరిచిపోకూడదు అంటోంది.
ఆస్ట్రేలియా వేదికగా ఫిబ్రవరి 21నుంచి మార్చి 8వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుంది. కాగా, హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత్ పొట్టి ప్రపంచ కప్ ఆడనుంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్. రిచా ఘోష్ అనే కొత్త ప్లేయర్ సైతం 15 మంది జట్టులో స్థానం దక్కించుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..