ముంబై: మహిళల ట్వంటీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఆదివారం (జనవరి 12న) 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 21నుంచి ఆస్ట్రేలియాలో పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ జరగనుంది. భారత జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ సారధిగా వ్యవహరిస్తుందని ట్విట్టర్లో బీసీసీఐ స్పష్టం చేసింది. రిచా ఘోష్ మాత్రమే కొత్త ప్లేయర్. కాగా, 15ఏళ్లకే బ్యాటింగ్‌లో దుమ్ము దులుపుతున్న షఫాలీ వర్మ సైతం 15 మంది సభ్యులలో చోటు దక్కించుకోవడం గమనార్హం.
📢Squad Announcement📢@ImHarmanpreet will lead India's charge at @T20WorldCup #T20WorldCup #TeamIndia pic.twitter.com/QkpyypyJKc
— BCCI Women (@BCCIWomen) January 12, 2020
టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన 15 మంది బ్యాట్స్ ఉమెన్:
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా భాటియా (వికెట్ కీపర్), పూనం యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..