దేశవ్యాప్తంగా భారత గణతంత్ర దినోత్సవం ఉత్సాహంగా సాగుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారత త్రివర్ణ పతాక రెపరెపలాడుతోంది. భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు.. గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజును దేశవ్యాప్తంగా పౌరులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఆసేతుహిమాచలం అంతా దేశభక్తితో నిండిపోయి కనిపిస్తోంది.
సాధారణంగా భారతీయతలో భక్తి భావం ఎక్కువ . ఈ భక్తి భావాన్ని పౌరులు దేశభక్తితోనూ జోడించారు. ఆలయాల్లోనూ భక్తి భావంతోపాటు దేశభక్తి కూడా వెల్లివిరుస్తూ కనిపిస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్ చంద్రేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఈ అద్భుతం కనిపించింది. ఆలయ సిబ్బంది .. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తిని చాటుకున్నారు. మహాదేవుని పవిత్ర లింగాన్ని త్రివర్ణ పూలతో అలంకరించారు. సువర్ణ లింగాన్ని త్రివర్ణ పూలతో అలంకరించడంతో భక్తులు కూడా మెచ్చుకుంటున్నారు. సదా శివుని ఆశీస్సులు భారత ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉంటాయని చెప్పుకుంటున్నారు..