UMB Pageant Mrs India Competition: పెళ్లి అయిన మహిళలు వంటింటికే పరిమితం కాదని నిరూపించారు తెలంగాణకు చెందిన వనిత సుష్మా తోడేటి. ఇప్పటికే మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ పోటీల్లో సత్తా చాటిన సుష్మా.. ఇటీవల జరిగిన యూఎంబీ ప్యాజెంట్ పోటీల్లోనూ తన టాలెంట్ నిరూపించుకున్నారు. థర్డ్ రన్నరప్‌గా నిలిచి గుర్తింపు పొందారు. అంతేకాదు మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ నుంచి ఆమె పాల్గొన్నారు. మన ఆచారాలు, సంప్రదాయాలను పాటించాలని ఆమె సూచిస్తున్నారు.
Also Read: Deepika Padukone: రణ్వీర్తో పెళ్లికి ముందు ఆరుగురితో దీపికా పదుకొణె డేటింగ్.. ఒకరు క్రికెటర్
గతంలో మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ పోటీల్లో సుష్మా వివిధ కేటగిరీల్లో అవార్డులు అందుకోవడం విశేషం. బెస్ట్ కల్చర్ డ్రెస్, మిసెస్ వెల్ స్పోకెన్, సోషల్ ఇన్స్టిట్యూట్ తదితర విభాగాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచి అవార్డులు అందుకున్నారు. ఇటీవల జరిగిన యూఎంబీ ప్యాజెంట్ మిసెస్ ఇండియా పోటీల్లో సుష్మా తోడేటి థర్డ్ రన్నరప్‌గా నిలిచి సత్తాచాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబమే తన బలం అని చెప్పారు. తన భర్త శ్రీనాథ్ వెన్నంటి ప్రోత్సహిస్తున్నారని.. అందుకే తాను ఈ స్థాయిలో రాణించగలుగుతున్నానని అంటున్నారు. ప్రపంచ వేదికలపై తెలంగాణ సంస్కృతిని పరిచయం తనకు గొప్ప అనుభూతిని కలిగించిందని సుష్మా తోడేటి చెబుతున్నారు. తెలంగాణ చేనేతను ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలపారు.
పెళ్లయిన తర్వాత మహిళలు తమ లక్ష్యాలను ఎప్పటికీ సాధించలేరనేది అపోహ అని ఆమె అంటున్నారు. మనకు మద్దతు ఇచ్చే కుటుంబ సభ్యులు ఉంటే మన ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందన్నారు. తన కలను సాకారం చేయడంతో అత్త, మామ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
మన దేశంలో యూఎంబీ ప్యాజెంట్ అందాల పోటీకి భారీగా క్రేజ్ ఉంది. ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి 70 మంది పాల్గొన్నారు. నాలుగేళ్ల క్రితం ఉర్మి, స్నిగ్ధా బారుహ్ స్థాపించిన ఈ పోటీలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ తారలు సారా అలీ ఖాన్, అర్జున్ కపూర్, మానుషి చిల్లర్, భూమి పెడ్నేకర్, నేహా ధూపియా, కరిష్మా కపూర్, మలైకా అరోరా తదితరులు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి