Muslim man offered namaz in hindu temple in nagole: సాధారణంగా మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వంను పాటిస్తుంటారు. ఇది మంచిదే .. ఒకరి మత ధర్మం, విశ్వాసాలను మరోకరు గౌరవించుకొవాలి. అంతే కాకుండా.. పరమత సహానంతో కూడా ఉండాలి. ఇదే క్రమంలో ఒకరి మత ధర్మాలను, నమ్మకాలను మరోకరు ఇబ్బందులు పెట్టే విధంగా అస్సలు ప్రవర్తించకూడదు. ఈ క్రమంలో.. ఇటీవల తెలంగాణలో జరుగుతున్న ఘటనలు మాత్రం వివాదాలకు కేరాఫ్ గా మారాయని చెప్పుకొవచ్చు.
మెయిన్ గా సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాం ధ్వంసం ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఒక వర్గానికి చెందిన వ్యక్తి అమ్మవారి విగ్రహాంను కాలితో తన్నుతూ.. నీచంగా ప్రవర్తించాడు. అంతే కాకుండా.. అమ్మవారి విగ్రహాంను పూర్తిగా ధ్వంసం చేశాడు. దీనిపై పెనుదుమారం తలెత్తింది. ఈ క్రమంలో ప్రస్తుతం.. హైదరబాద్ లో వరుస ఆలయాల ధ్వంసం ఘటనలు వార్తలలో ఉంటున్నాయి.
శంషాబాద్లో నవగ్రహాల ఆలయం, పొచమ్మ ఆలయం ధ్వంసం ఘటన కూడా వార్తలలో నిలిచాయి. అయితే.. దీని వెనుకాల పెద్ద కుట్ర ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం.. హైదరాబాద్ లోని నాగోల్ లో మరో ఘటన చోటు చేసుకుంది.
పూర్తి వివరాలు..
హైదరాబాద్ లోని నాగోల్ లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న.. ధనలక్ష్మి నగర్ చండీ అమ్మవారి ఆలయానికి ఒక ముస్లిం వ్యక్తి వచ్చాడు. అతను.. అక్కడ టెంపుల్ లో హోమం జరుగుతుండగా.. నమాజ్ చేస్తు నిలబడ్డాడు. అక్కడ అయ్యప్ప మాలధారులు వచ్చారు. అతడ్ని బైటకు తీసుకెళ్లారు కొంత సేపు అక్కడ వాగ్వాదం జరిగినట్లు తెలుస్తొంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. మాత్రం ఫైర్ అవుతున్నారు. ఇలాంటి పనులు మీ మజ్జీత్ లోకి వచ్చి చేస్తే ఊరుకుంటారా.. అని ఫైర్ అవుతున్నారు. దీనిపై మళ్లీ సోషల్ మీడియాలో వివాదస్పదంగా మారిందని చెప్పుకొవచ్చు. దీనిపై హిందు సంఘాలు సైతం మండిపడుతున్నాయి.