Telangana Employees JAC: ఉద్యోగుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని.. దాడికి పాల్పడిన, ప్రేరేపించిన వారిని ఉపేక్షించొద్దని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. దాడితో రాష్ట్రంలో ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతిన్నదని వివరించింది. తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు కోరారు. లగచర్లలో జరిగిన ఘటనలో అధికారులపై దురుసుగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
Also Read: GO 16 Cancel: తెలంగాణ ఉద్యోగులకు భారీ షాక్.. జీవో 16 రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు
వికారాబాద్ జిల్లా లగచర్లలో ప్రభుత్వ అధికారులపై జరిగిన దురుసు ప్రవర్తనపై తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సంఘటనపై స్పందించాలని కోరుతూ హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. లగచర్ల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను గవర్నర్‌కు వివరించారు. రైతుల మాటున దాడి చేసిన దోషులు, దాడికి ప్రేరేపించిన కుట్రదారులపై కఠిన చర్యలకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు.
Also Read: Harish Rao: విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి.. హరీష్ రావు ఫైరింగ్ స్పీచ్
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. రైతుల మాటున కొందరు దుండగులు అధికారులపై దాడికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించే ప్రమాదం ఉందనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొందని వివరించారు. అధికారులపై దాడికి పాల్పడ్డ దుండగులపై, దాడికి ప్రేరేపించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు.
'రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భద్రత కోసం.. సురక్షిత వాతావరణంలో స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించేలా సంబంధిత అధికార వర్గాలకు ఆదేశాలు ఇవ్వాలి' అంటూ గవర్నర్‌కు జేఏసీ ప్రతినిధులు విన్నవించారు. జేఏసీ నాయకులు చెప్పిన ప్రతి అంశాన్ని గవర్నర్ విని తప్పక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. లగచర్ల ఘటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై జేఏసీ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్‌ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.