School Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటే

School Holidays 2024: విద్యార్ధులకు గుడ్‌న్యూస్. మొన్న అంటే నవంబర్ 18 నుంచి వరుసగా పాఠశాలలకు సెలవులిచ్చేశారు. తదుపరి ఆదేశాల వరకూ ఈ సెలవులుంటాయి. ఈ సెలవులు ఎక్కడ, ఎందుకనే వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 20, 2024, 11:17 AM IST
School Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటే

School Holidays 2024: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్ని పురస్కరించుకుని యూపీ, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు ప్రకటించారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ, హర్యానాలో కూడా స్కూళ్లకు సెలవులిచ్చేశారు. 

ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్, సిసామౌ, కుందర్కి, గజియాబాద్, ఫూల్పూర్, మాఝవాన్, కటేహరి, ఖైర్, మీరాపూర్‌తో పాటు పంజాబ్‌లోని బర్నాలా, గురుదాస్ పూర్, హోషియార్ పూర్, శ్రీ ముక్త్సార్ సాహెబ్ జిల్లాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని 1-5 వ తరగతి విద్యార్ధులకు స్కూళ్లకు నిరవధిక సెలవులు ప్రకటించారు. ఓ వైపు ఎన్నికలు మరోవైపు కాలుష్యం కారణంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. అటు అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ సహా అన్ని స్కూళ్లకు ఇవాళ నవంబర్ 20న సెలవులిచ్చారు. ఇక గౌతమ్ బుద్ధ నగర్‌లోని స్కూళ్లకు నవంబర్ 23 వరకూ సెలవులిచ్చేశారు. ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. 

ఇక రాజస్థాన్‌లోని ఖైర్తాన్, తిజారా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి వరకూ నవంబర్ 20 అంటే ఇవాళ్టి నుంచి నవంబర్ 23 వరకూ సెలవులిచ్చేశారు. ఇక హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో నవంబర్ 19 నుంచి నవంబర్ 23 వరకూ 12 వ తరగతి వరకూ అందరికీ అంటే స్కూల్స్, కళాశాలలకు కాలుష్యం కారణంగా సెలవులిచ్చారు. భీవాని ప్రాంతంలోని అన్ని పాఠశాలలకు 5 వ తరగతి వరకూ నవంబర్ 19 నుంచి నవంబర్ 23 వరకూ సెలవులిచ్చారు. ఇక పానిపట్ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేట్  స్కూళ్లకు 5వ తరగతి వరకూ ఇప్పటికే నిరవధిక సెలవులిచ్చేశారు. గురుగ్రామ్, సోనిపట్, ఝాజర్, రోహ్తక్ ప్రాంతాల్లో ప్రాధమిక పాఠశాలలు నిరవధికంగా మూతపడ్డాయి.

రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఢిల్లీ, నోయిడాలో 12వ తరగతి వరకూ స్కూల్స్, కాలేజెస్‌కు సెలవులిచ్చారు. తిరిగి ఎప్పుడు తెరిచేది తరువాత ప్రకటిస్తారు. ప్రస్తుతానికి ఆన్‌లైన్ విధానంలో తరగతులు జరుగుతున్నాయి. ఫరియాబాద్, ఘజియాబాద్, గురుగ్రామ్, నోయిడాలో ఇదే పరిస్థితి ఉంది. మొత్తానికి ఇటు ఎన్నికలు, అటు కాలుష్యం ప్రభావంతో విద్యా సంస్థలకు నిరవధికంగా మూతపడ్డాయి. ఢిల్లీ, నోయిడా, హర్యానాలో అయితే ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు కూడా పనిచేయడం లేదు.

Also read: IPL 2025 Mega Auction: ఐపీఎల్ వేలంలో ఈసారి రికార్డు ధరలు సంచలనాలు ఖాయమా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News