Dharmapuri Arvind: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో మా నేతల లోపాల వల్లే ఇక్కడ ఓడిపోయాము. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా..మేము ఆల్టర్ నేటివ్ గా కనిపించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ నిజామాబాద్, ఆదిలాబాద్ లో గెలిచింది. అక్కడ మా పార్టీ నేతలతో కలిసి పనిచేయడం వల్ల.. నార్త్ తెలంగాణలో 7 సీట్లు వచ్చాయి. రాజా సింగ్.. మాత్రం సొంతంగా గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు.
బండి సంజయ్ తో మాకు విభేదాలు లేవు. బండి సంజయ్ లో కొన్ని ఫెల్యూర్స్ ఉన్నాయి. మరోవైపు పార్టీ అధ్యక్ష రేసులో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తే.. ఇస్తే తన సత్తా ఏంటో చూపిస్తాన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఓటెయని ప్రజలు.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినా.. అది ఇక్కడ పార్టీ నాయకుల గొప్పతనం కాదు. నరేంద్ర మోడీ చేసిన పని.. జాతీయవాదం.. అమిత్ షా చాణక్యం వల్లే ఇక్కడ ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు.
ఇక ఎంపీ ఎన్నికల్లో నాకు టిక్కెట్టు ఇవ్వొద్దని కొందరు అధిష్ఠానానికీ కంప్లైంట్ చేశారు. అపుడు అల్టరేనేట్ ఎవరని అడిగితే.. ఆయనకు తప్పించి ఎవరికిచ్చినా.. అభ్యంతరం లేదని చెప్పారు. మొత్తంగా అధిష్ఠానం నాకు టికెట్ ఇచ్చింది.రెండు సార్లు బలమైన క్యాండిడేట్స్ పై గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు. మొదటి సారి కవితపై .. రెండోసారి జీవన్ రెడ్డిపై గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు.
కేటీఆర్ ఢిల్లీలో ఏ కేంద్ర మంత్రిని గెలవలేదు. రేవంత్ తో నాకు మంచి దోస్తానా ఉంది. అంతేకాదు కాంగ్రెస్ నేతలైన కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ వంటి వారు నాకు దోస్తులున్నారు. రేవంత్ పాలనా పూర్.. గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రేవంత్ రెడ్డి .. ఓవైసీ కాలేజీలో అడుగుపెట్టే దమ్ముందా.. ఓల్డ్ సిటీలో అడుగుపెట్టకుండా.. మూసీ ప్రక్షాళన చేయడం అసాధ్యమన్నారు. ఏ ఆయన ఏం చేయబోతున్నాడో చూడాలన్నారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అహ్మదాబాద్ లో ని సబర్మతి నది సుందరీకరణ చేసారు. అంతకు ముందే.. నిర్వాసితులకు ఇండ్లు.. పునరావాసం కల్పించిన తర్వాతే సబర్మతి నది బాగు పడిందన్నారు. కానీ మూసీ సుందరీకరణ విషయంలో రేవంత్ రెడ్డి.. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఎలా ప్రక్షాళన చేస్తారనేది చూడాలన్నారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter