Who is Vaibhav Suryavanshi: ఐపీఎల్ మెగా వేలానికి క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 24, 25వ తేదీల్లో వేలం జరగనుంది. ఈసారి ఆక్షన్‌లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నా.. అందరిని ఆకర్షిస్తుంది మాత్రం 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. చిన్నప్పటి నుంచే సంచనాలు సృష్టిస్తున్న ఈ యంగ్ క్రికెటర్.. ఐపీఎల్ వేలానికి రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తన పేరు నమోదు చేసుకున్నాడు. బీసీసీఐ కూడా అతని పేరు షార్ట్ లిస్ట్‌లో చేర్చడంతో అందరి దృష్టి ఈ యంగ్ క్రికెటర్‌పై పడింది.
Also Read: Dharmapuri Arvind: మా నేతల లోపాల వల్లే తెలంగాణలో ఓడిపోయాం.. ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు..
బీహార్‌లోని సమస్తిపూర్ నగరానికి సమీపంలో తాజ్‌పూర్ అనే గ్రామానికి చెందిన వైభవ్ సూర్యవంశీ పేరు ఈసారి మారుమోగుతోంది. 2011లో వైభవ్ సూర్యవంశీ జన్మించాడు. అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ బతుకుదెరువు కోసం ముంబైకి వచ్చి.. కొద్ది రోజులు బౌన్సర్‌గా పనిచేశాడు. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. కాస్త ఖాళీ సమయం దొరికినా ముండైలోని గ్రౌండ్స్‌లో జరిగే మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లేవాడు. తరువాత పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టడంతో మళ్లీ స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సంజీవ్ చిన్న కొడుకు నాలుగేళ్ల నుంచే క్రికెట్ ఆడడం ప్రారంభించడం గమనించాడు. అప్పటికే క్రికెట్‌పై మక్కువ ఉండడంతో కొడుకును ఎలాగైనా క్రికెటర్‌ను చేయాలని అనుకున్నాడు. ఇంటి వెనుక నెట్ రెడీ చేసి.. కొడుకు ప్రాక్టీస్ చేసేందుకు సిద్ధం చేశాడు.
ఆ తరువాత 8 ఏళ్ల వయసులోనే సమస్తిపూర్ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అక్కడ శిక్షణలో మరింత రాటుదేలిన వైభవ్.. మరో రెండేళ్లలోనే అంటే పదేళ్ల వయసులోనే అండర్-16 జట్టులో చోటు సంపాదించాడు. బ్యాటింగ్, బౌలింగ్ దుమ్ములేపుతున్న ఈ చిచ్చరపిడుగు.. ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఐదు మ్యాచ్‌లు ఆడాడు. అండర్-19 టీమ్‌లో కూడా చోటు దక్కించుకున్న వైభవ్.. ఆస్ట్రేలియాపై వైభవ్ కేవలం 58 బంతుల్లో 104 పరుగులు చేయడం విశేషం.
ఓపెనింగ్‌లో దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థుల ఫీల్డ్ సెటప్‌ను తనకు అనుకూలంగా మార్చుకుని పరుగులు రాబట్టడంలో వైభవ్ దిట్ట. 13 ఏళ్ల వయసుకే అతని పేరు ఐపీఎల్ వేలంలో చేర్చడంతో క్రికెట్ ప్రపంచంలో చర్చ మొదలైంది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్న ఈ యంగ్ క్రికెటర్‌ను ఎవరైనా వేలంలో తీసుకుంటే.. అది పెను సంచలనం అవుతుంది. 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ ఆరంభించి.. అరవీర బౌలర్లను ఎదుర్కొని ఎన్నో రికార్డులు సృష్టించి క్రికెట్ దేవుడిగా మారిన సచిన్‌ను చూశాం. ఇప్పుడు 13 ఏళ్లకే కసితో క్రికెట్ ఆడుతున్న వైభవ్.. ఐపీఎల్‌లో ఎంట్రీ ఇస్తే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు గేట్లు ఓపెన్ అయినట్లే. వైభవ్‌లోని టాలెంట్‌ను గుర్తించి ఏ ఫ్రాంచైజీ అయినా కొనుగోలు చేస్తే.. టీమిండియా క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం మొదలైనట్లేనని క్రికెట్ పండితులు చెబుతున్నారు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చి.. సరికొత్త రికార్డులు సృష్టించాలని ఆశిద్దాం..
Also Read: Viral Video: అమ్మాయికి మెస్సెజ్ చేశాడని దారుణం.. యువకుల పాశావిక దాడి.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.