Divorce Celebrity Couples: ఏఆర్ రెహమాన్, నాగ చైతన్య సహా ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు..

Divorce Celebrity Couples: ఫిల్మ్  ఇండస్ట్రీలో మ్యారేజేస్ ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. అలా అని అందరు విడిపోవడం లేదు. కొంత మంది లైఫ్ లాంగ్ కలిసి ఉంటున్నారు.  ఒకరికొకరు తోడు నీడాగా ఉంటున్నారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకుంటున్న ప్రకటించారు. రెహమాన్ దంపతుల  కంటే ముందు విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరెవరున్నారంటే..

1 /8

ఏఆర్ రెహమాన్ - సైరా.. తాజాగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాకు తలాక్ ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు 29 యేళ్ల వివాహా బంధానికి ముగింపు పలికారు.

2 /8

జీవీ ప్రకాష్ - సైంధవి.. రెహమాన్ కంటే ముందు ఆయన మేనల్లుడు ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సైంధవి దంపతులు కూడా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే కదా.

3 /8

నిహారిక - చైతన్య జొన్నలగడ్డ.. మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ ఇద్దరు మనస్పర్థల కారణంగా విడిపోయారు.  వీరిద్దరి పెళ్లితోపాటు డైవోర్స్ ఇష్యూ పెద్ద చర్చనీయాంశంగా మారింది.

4 /8

సమంత - నాగ చైతన్య.. నాగ చైతన్య, సమంతల మ్యారేజ్  ఎంత గ్రాండ్ గా జరిగిందో.. వీరిద్దరి విడాకుల వ్యవహారం కూడా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. 

5 /8

ధనుశ్ - ఐశ్వర్య.. రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య, ధనుశ్ కూడా ఎన్నో ఏళ్ల వైవాహాకి బంధాన్ని విడాకులతో ముగింపు పలికారు. 

6 /8

మంచు మనోజ్.. మంచు మనోజ్, ప్రణతి రెడ్డిల వివాహాం బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత మంచు మనోజ్.. భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహాం చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది రెండో వివాహాం కావడం గమనార్హం. 

7 /8

నాగార్జున - లక్ష్మి.. నాగ చైతన్య అమ్మనాన్నలైన నాగార్జున, లక్ష్మిలు కూడా అప్పట్లో పరస్పర అంగీకారంతో  విడిపోయారు. అమ్మ లక్ష్మికి విడాకులు ఇచ్చిన తర్వాతే అమలను పెళ్లి చేసుకున్నారు నాగార్జున. అటు లక్ష్మీ కూడా శరత్ అనే ఆయనను మ్యారేజ్ చేసుకుంది.

8 /8

పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ - నందిని.. పవన్ కళ్యాణ్ తన మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన తర్వాత రేణు దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు.