బీజేపీపై ఘాటు విమర్శలు చేసిన ఉద్దవ్ ఠాక్రే

మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలకు కారణం బీజేపీనే అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేన అధికార పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి

Last Updated : Feb 3, 2020, 04:32 PM IST
బీజేపీపై ఘాటు విమర్శలు చేసిన ఉద్దవ్ ఠాక్రే

ముంబై : మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలకు కారణం బీజేపీనే అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేన అధికార పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమి ఏర్పాటు చేయడం ఎలా అనైతికం అవుతుందనిసామ్నాలో ప్రశ్నించారు. గతంలో బీజేపీ మిగతా పార్టీలతో పొత్తుపెట్టుకోలేదా అని నిలదీశారు.

 గతంలో మహాకూటమి ద్వారా ఎన్నికైన జేడీయూ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా అని సామ్నాలో పేర్కొన్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే కోరిక మేరకు ఓ శివసైనికుడ్ని సీఎం చేయమని బీజేపీని అడిగామని అని అన్నారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే బీజేపీ తన మాట నిలబెట్టుకుని ఉంటే ఇవాళ తన స్థానంలో మరో శివ సైనికుడు సీఎం అయ్యుండేవాడని తెలిపారు. బీజేపీ చేస్తే ఒక విధంగా, ఇతరులు చేస్తే వేరే విదంగా ఎలా ఉంటుందని ఆయన సాఅమ్న పత్రిక ద్వారా ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీఎం పీఠం వద్ద సయోధ్య కుదరక శివసేనకు బీజేపీ దూరమైన సంగతి తెలిసిందే. ఆపై శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

Trending News