Gold Price Today: బంగారం ధరలకు రెక్కలు విరిగాయి. అవును బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత వారం భారీగా పెరిగిన బంగారం ధరలు..నేడు కాస్త తగ్గాయి. అయితే పసిడి ప్రియులకు ఈ మురిపం ఎన్ని రోజులు ఉంటుంది...ఇన్నాళ్లూ భారీగా పెరిగిన బంగారం ధర నేడు ఒక్కసారిగా ఎందుకు తగ్గింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Price Today: తులం బంగారం ధర 80 వేలకు చేరుకుంది. ఈ తరుణంలో నేడు సోమవారం ఒక్కసారిగా బంగారం ధర తగ్గింది. బంగారం ధర అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే భారీగా తగ్గడం ప్రారంభించాయి. ఒక దశలో బంగారం ధర 75వేల రూపాయలకు వరకు పడిపోయింది. అయితే మళ్లీ ధరలు ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయి. గత వారం రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర సోమవారం ఒక్కసారిగా భారీగా తగ్గింది. దీని గల కారణమేంటో తెలుసుకుందాం.
ఈ రోజు 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72, 990 ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు 79, 630గా ఉంది. నిన్న ధరలతో పోల్చితే స్వల్పంగానే తగ్గిందని చెప్పవచ్చు. వెండి కిలోధర కూడా స్వల్పంగానే తగ్గింది. ప్రస్తుతం వెండి కిలో రూ. 91,900 వద్ద ఉంది. నిన్నటితో పోల్చితే కేవలం రూ. 100 మాత్రమే తగ్గింది.
రష్యాపై ఉక్రెయిన్ దాడులు పెంచడంతో మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. అమెరికా అనుమతితో ఉక్రెయిన్ రష్యపై క్షిపణుల దాడులు ప్రారంభించడంతో ప్రపంచ మార్కెట్లో ఆందోళన నెలకొంది. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయం అవ్వగానే బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ఎందుకంటే మార్కెట్లో పెట్టుబడి దారులు సెంటిమెంట్ పెరిగి స్టాక్ మార్కట్లు లాభాల్లోకి వెళ్లాయి. దీంతో బంగారం ధరలు తగ్గాయి.
అయితే స్టాక్ మార్కెట్లు పతనమైనప్పుడు బంగారం ధరలు పెరుగుతుంటాయి. ఎందుకంటే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను కాపాడుకునేందుకు బంగారంపై పెట్టుబడి పెడుతుంటారు. ఫలితంగా డిమాండ్ పెరిగి బంగారం ధర పెరుగుతుంది.
సాధారణంగా సాంప్రదాయ పెట్టుబడులైన స్టాక్ మార్కెట్, ప్రభుత్వ బాండ్ల విలువ పెరిగినప్పుడు బంగారం ధరలు తగ్గుతుంటాయి.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు చూస్తుంటే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం ఉన్న సెంటిమెంట్ ఇలాగే కొనసాగినట్లయితే పసిడి ధర భవిష్యత్తులో 60 నుంచి 70వేల మధ్యలోకి దిగివచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.