Heavy Massive Rains: తమిళనాడులో కుండపోత వానలు.. కొట్టుకుపోయిన బస్సులు, కార్లు..


Heavy Massive Rains: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారింది. దీంతో తమిళనాడులో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

1 /5

Heavy Massive Rains: ఫెంగల్ తుఫాను ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తమిళనాడు ప్రాంత ప్రజలను తీవ్రంగా వణికిస్తోంది. అటు తెలంగాణలో కూడా ఫెంగల్ తుఫాను కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తుఫాను కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలకు కార్లు, టీ వీలర్స్ కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు లబోదిబో మంటున్నారు.

2 /5

తాజాగా ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు సింధు సాగరం (అరేబియా సముద్రం)లో  ప్రవేశించే ఛాన్సెస్ ఉన్నట్టు తెలిపింది.

3 /5

దీని ప్రభావంతో ఈనెల 8వతేదీ వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత ఒక్కసారిగా తగ్గింది. కానీ రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.

4 /5

తుఫాను ప్రభావంతో ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకుంది. హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో తెల్లవారు జామున వర్షం పడింది.

5 /5

ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఈనెల 8వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.