Eknath shinde: తీవ్ర అస్వస్థతకు గురైన మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖమంత్రి ఏక్ నాథ్ షిండే.. హుటాహుటినా ఆసుప్రతికి తరలింపు..

Eknath shinde Hospitalised: మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు మూడు రోజులుగా తీవ్ర గొంతు నొప్పితో బాధపడుతున్న ఆయన ఈ రోజు థానే లోని జూపిటర్ ఆసుపత్రిలో చేరారు. ఏక్ నాథ్ షిండే పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 3, 2024, 02:48 PM IST
Eknath shinde: తీవ్ర అస్వస్థతకు గురైన మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖమంత్రి ఏక్ నాథ్ షిండే.. హుటాహుటినా ఆసుప్రతికి తరలింపు..

Eknath shinde Hospitalised: మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న మొన్నటి వరకు అంతా బాగానే ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ఎటు తేలని ఈ సమయంలో సడెన్ గా ఏక్ నాథ్ షిండే అస్వస్థతకు గురి కావడంతో రాజకీయంగా మహారాష్ట్రలో కాకరేపుతోంది.  ఏక్ నాథ్ షిండే ను థానే లోని జూపిటర్ హాస్పిటల్ లో చేర్పించారు.ఇప్పటికే వైద్యులు ఆయనకు డెంగ్యూ, మలేరియా పరీక్షలు నిర్వహించగా.. అందులో ఎలాంటి లక్షణాలు లేవని చెప్పింది. కానీ బాడీ వైట్ సెల్స్ తగ్గడం వల్ల వాటికి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. తీవ్ర జ్వరం కారణంగా ఏక్ నాథ్ షిండే యాంటీ బయాటిక్స్ వాడుతున్నారు.

ఏక్ నాథ్ షిండే అనారోగ్యం బారిన పడటంతో  శివ సైనికులు ఒక్కొక్కరుగా హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మినిష్టర్ అమిత్ షా కూడా ఏక్ నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. నిన్న రాత్రి మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రితో పాటు  భాగస్వామ్య పక్షాల మధ్య మంత్రి పదవుల విషయమై భేటి కావాల్సిన మహాయుతి.. ఏక్ నాథ్ షిండే అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. మరోవైపు బీజేపీ శాసనసభా పక్షం షిండే రాకపోవడంతో రేపటికి వాయిదా పడింది. రేపే శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకొని ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశం ఉంది.

ఇప్పటికే కేంద్ర పెద్దలు ఈ నెల 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. మరి షిండే అనారోగ్యం కారణంగా ఇది వాయిదా పడునుందా లేకపోతే.. యథావిధిగా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హోం, స్పీకర్‌ పదవి విషయంలో భారతీయ జనాత పార్టీ పట్టు వీడటం లేదు.  ఈ కారణం వల్లే కొత్త ముఖ్యమంత్రి ప్రకటన లేట్ అవుతోందనేది బీజేపీ అంతర్గత సంభాషణల్లో వ్యక్తం అవుతోంది. మరోవైపు శివసేన ఉద్ధవ్ తో పాటు శరత్ పవార్ ఎన్సీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు కొంత మంది ఇండిపెండెంట్లు .. బీజేపీవైపు చూస్తున్నారు. ఒకవేళ వాళ్లు బీజేపీలో జంప్ అయితే.. మహారాష్ట్రలో బీజేపీకి ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ల అవసరం లేకుండా ప్రభుత్వ ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 132 ఎమ్మెల్యేలున్నారు. మరో 13 మంది చేరికతో మ్యాజిక్ ఫిగర్ ను ఈజీగా క్రాస్ చేయవచ్చు. మరి షిండే అనారోగ్యంతో మహా రాజకీయం మరింత రసకందాయంలో పడిందనే చెప్పాలి.

ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..

ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News