టాలీవుడ్ యంగ్ హీరో మృతి

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.  టాలీవుడ్ యంగ్ హీరో ఉదయ్ కిరణ్ మృతి చెందాడు. నిన్న అర్ధరాత్రి గుండెపోటు రావడంతో అతన్ని కుటుంబ సభ్యులు కాకినాడలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Last Updated : Feb 15, 2020, 01:42 PM IST
టాలీవుడ్ యంగ్ హీరో మృతి

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.  టాలీవుడ్ యంగ్ హీరో ఉదయ్ కిరణ్ మృతి చెందాడు. నిన్న అర్ధరాత్రి గుండెపోటు రావడంతో అతన్ని కుటుంబ సభ్యులు కాకినాడలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 
 

ఇవాళ మృతదేహాన్ని తూర్పుగోదావరి జిల్లా రామరావుపేటలోని ఆయన స్వగృహానికి తరలించారు. ఉదయ్ కిరణ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కేవలం 34 ఏళ్ల  వయసులోనే గుండెపోటుకు గురై..  చనిపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు.  
ఉదయ్ కిరణ్..ఇప్పుడిప్పుడే సినిమాల్లో రాణిస్తున్నాడు. గతంలో పరారే, ఫ్రెండ్స్ బుక్ సినిమాల్లో నటించాడు. పలు తమిళ సినిమాల్లో ఉదయ్ కిరణ్ మంచి పాత్రలు పోషించాడని తెలుస్తోంది.

Trending News