Nagamani Stone Original Video Here Click Now: హిందూ పురాణాల్లో నాగమణి గురించి ఎంత క్లుప్తంగా వివరించారో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా మనం తరచుగా చాలాసార్లు పౌరాణిక సినిమాల్లో నాగమణి గురించి పదేపదే చూసుంటాం.. వాటిల్లో నాగమణికి ఏకంగా ఎంతో పవర్ఫుల్ కలిగిన నాగుపాములే కాపలాగా కాస్తాయి. కానీ నిజంగా మీరు ఎప్పుడైనా నాగమణి స్టోన్ కి కింగ్ కోబ్రా కాపలా కాయడం చూశారా..? ఎస్ మీరు అనుకుంటున్నారే జరిగింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ జనరేషన్ వారికి నాగమణి అంటే చాలామందికి తెలీదు. ఇది ఒక రత్నం లాగే ఉంటుంది.. కానీ చాలా అరుదుగా పాముల తల భాగంలో ఉంటుంది. ఎంతో పవర్ఫుల్ పాములు తమనాగమనులను శిరస్సులో దాచుకుంటూ ఉంటాయి. అయితే దీనిని సొంతం చేసుకోవడానికి చాలామంది ఎప్పుడు నాగమణి స్టోన్ ఉన్న పాముల కోసం అన్వేషిస్తూనే ఉంటారు. ఆ పామును వెతికి పట్టుకునే క్రమంలోనే వాటి కాటుకే గురై మరణిస్తూ ఉండడం మనం చాలా వార్తల్లో చూస్తున్నాం. ఇదంతా మనం తరచుగా సినిమాల్లో చూసి ఉంటాం..
హిందూ సాంప్రదాయం , పురాణాల్లో నాగుపాములకు, నాగమణి స్టోనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. హిందువులు ఎంతో శక్తివంతమైన దేవుడిగా భావించి శివుడి మెడలో కూడా పాము ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున పామును పూజించడం ఆనవాయితీగా వస్తోంది. కొన్ని ఏళ్ల కింద నిర్మించిన పురాతన దేవాలయాలకు నాగుపాములే రక్షణగా ఉండేవట.. అంతేకాకుండా అందులో ఉండే వజ్రాలకు వైడూర్యాలకు నగలకు కూడా పాములే కాపలాగా ఉండేవని చరిత్ర చ చెప్పినట్లు వివిధ సినిమాల్లో కూడా ప్రస్తావించారు.
ఇప్పటివరకు మనం సినిమాలు సీరియల్స్ లో పాములు వజ్రాలకు, దేవాలయానికి సంబంధించిన ధన బాండాగారానికి ఒక ఆపలాగా ఉండే సన్నివేశాలు మాత్రమే చూసి ఉన్నాం.. ఇలా సినిమా, సీరియల్స్ లో మాత్రమే ఉంటాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ వీడియో చూస్తే అందరూ ఒక్కసారిగా స్టన్ అవుతారు. ఈ సన్నివేశాలు చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి రియల్ లైఫ్ లో కూడా ఉంటాయని నోరెళ్ల పెట్టుకుంటున్నారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎక్కడిదో తెలియదు కానీ సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ 12 అడుగుల కింగ్ కోబ్రా దగదగ మెరిసిపోతున్న నాగమణి స్టోన్ కి కాపలాగా కాస్తోంది. అంతేకాదండోయ్ ఈ పాము అటు ఇటు చూస్తూ పడగవిప్పి బుసలు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ఇదెక్కడ జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 12 సెకండ్ల నిడివి గల వీడియో సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. అయితే చాలామంది దీనిని ఫేక్ వీడియో అని అంటున్నారు. నిజానికి ఇలాంటి వీడియోలు చూడడం చాలా అరుదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.