EX MLA Chennamaneni Ramesh Babu:జర్మనీ పౌరుడిగా ఉంటూ శాసన సభకు ఎన్నికయ్యారని హైకోర్టు తెలిపింది. తప్పుడు సమాచారం ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు చెన్నమనేనికి రూ. 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. దీనిలో చెన్నమనేనికి ప్రధాన ప్రత్యర్థిగా పోటీ చేసిన ఆది శ్రీనివాస్‌కు నెల రోజుల్లో రూ. 25 లక్షల రూపాయలు చెల్లించాలన్నారు. మిగాత రూ. 5 లక్షలు రూపాయలు లీగల్ సెల్ సర్వీసెస్ అధికారికి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
మొత్తంగా 2009లో మొదలైన వేములవాడ అప్పటి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదానికి హైకోర్టు తీర్పుతో తెర పడింది. గత 15 ఏళ్లుగా చెన్నమనేని రమేష్ బాబు జర్మనీ పౌరసత్వం పై పోరాటం చేసి ఎట్టకేలకు గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.
కోర్టును తప్పుదోవ పట్టించినందుకు చెన్నమనేని రమేశ్ పై హైకోర్టు ఆగ్రహం.మొత్తంగా చెన్నమనేని రమేష్ పిటీషన్ డిస్మిస్ చేసిన ఉన్నత న్యాయస్థానం. పదిన్నర యేళ్ల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ. విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చింది. ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించిన రమేష్ బాబు. కోర్టును తప్పుదొవ పట్టించినందకు రూ. 30 లక్షల జరిమానా విధించిన హైకోర్టు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కు రూ. 25 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. మరో రూ. 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ జరిమానాను నెల రోజుల్లోనే చెల్లింపులు పూర్తి చేయాలని చెన్నమననేని రమేశ్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో 2009 లో ఎన్నికల్లో గెలిచిన ఎంఎల్ఏ రమేష్ బాబు గెలిచాడని 2009 హైకోర్టు ను ఆశ్రయించిన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అది శ్రీనివాస్.
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.