Amla Benefits: రోజూ ఉసిరి జ్యూస్ తాగితే కలిగే అద్భుతాలు ఇవే

Amla Benefits: మనిషి ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు ప్రకృతి నుంచే లభిస్తుంటాయి. ఏ పోషకాలు ఎందులో ఉంటాయో తెలుసుకుని తింటే అంతకంటే ప్రయోజనం మరొకటి ఉండదు. ఇందులో ముఖ్యమైంది ఉసిరి. ఇది ఆరోగ్యపరంగా అద్భుతమైన లాభాలు కలిగి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 9, 2024, 03:19 PM IST
Amla Benefits: రోజూ ఉసిరి జ్యూస్ తాగితే కలిగే అద్భుతాలు ఇవే

Amla Benefits: ప్రస్తుతం చలికాలం పీక్స్‌కు చేరుతోంది. చలికాలం వస్తే చాలు శరీరం ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఫలితంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్ధాలు డైట్‌లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. చలికాలంలో విరివిగా లభించే ఉసిరిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. క్రమం తప్పకుండా ఉసిరి తీసుకుంటే ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది. 

చలికాలంలో ఉసిరి పెద్దఎత్తున లభిస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ ఇ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజూ క్రమం తప్పకుండా ఉసిరి తీసుకుంటే చాలా వ్యాధులు దూరం చేయవచ్చు. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, పోలీఫెనోల్స్, ఆల్కలాయిడ్స్ కారణంగా అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. ఉసిరి రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త నాళాల్లో పేరుకునే చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తొలగించవచ్చు. ట్రై గ్లిసరాయిడ్స్‌ను వేగంగా తగ్గించవచ్చు. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ తగ్గుతుందో రక్తపోటు కూడా అదుపులో వచ్చేస్తుంది. 

చర్మ సంరక్షణలో ఉసిరిని అనాదిగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదపరంగా ఉసిరికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఉసిరి జ్యూస్ క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను దోహదం చేస్తుంది. కేశాల్ని బలోపేతం చేస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. 

ఉసిరి జ్యూస్ రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. స్థూలకాయం సమస్యతో బాధపడేవారికి ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరి జ్యూస్ రోజూ పరగడుపున తాగితే బరువు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా కీళ్ల నొప్పులకు చెక్ చెప్పవచ్చు. ఉసిరి జ్యూస్ క్రమం తప్పకుండా తాగితే మెమరీ పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. 

Also read: Bank Holidays 2024: రేపట్నించి ఈ నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News