Delhi Politics Pushpa 2 War:‘పుష్ప’లో అల్లు అర్జున్ తగ్గేదలే అంటూ చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయింది. అదే డైలాగ్ హిందీలో పుష్ప జుగేగా నహీ అన్న డైలాగ్ నార్త్ లో బాగా చొచ్చుకుపోయింది. ఈ నేపథ్యంలో కొంత మంది ట్రేడ్ అనలిస్టులు.. పుష్ప 2 జుగేగా నహీ... బాక్సాఫీస్ రుకేగా నహీ.. అంటే.. పుష్ప 2 తగ్గేదే లేదు.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. ముఖ్యంగా హిందీ బెల్టులు ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం ఈ సినిమా తొలి రోజు నుంచి అక్కడ రికార్డుల ఊచకోత కోస్తోంది. ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేస్తూ.. 5 రోజుల్లోనే ఈ సినిమా రూ. 350 కోట్ల నెట్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ఈ సినిమాలో డైలాగులతో పాటు పోస్టర్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి.
అప్పట్లో బాహుబలి సినిమా హిట్ నేపథ్యంలో ఢిల్లీ సహా నార్త్ రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు ప్రజలను ఆకట్టుకోవడానికి ఆయా సినిమాలోని పోస్టర్స్ ను తమ రాజకీయాల కోసం వాడుకున్నారు. అదే నేపథ్యంలో ఇపుడు పుష్ప 2 హిట్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీని ఇపుడు పుష్ప మేనియా ఊపేస్తోంది. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ కూడా ఎక్కడా తగ్గేదేలే పోస్టర్ వార్ కు తెరలేపాయి.
ఇప్పటికే ఢిల్లీలో వరుసగా రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ.. చీపుతో తుడిచిపెట్టేసింది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా ఢిల్లీ పీఠం దక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో అక్కడ ప్రజలు ఓ లాగా.. అసెంబ్లీ ఎన్నికలకు మరోలా తీర్పునిస్తు వస్తున్నారు. ఈ క్రమంలో దేశ రాజధానిలో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. ఆధికారం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల మధ్య పోస్టర్ వార్ జరుగుతోంది.
'పుష్ప 2' చిత్రంలోని పాపులర్ డైలాగ్ 'తగ్గేదేలే' అంటూ కేజ్రీవాల్ పార్టీ గుర్తు 'చీపురు' చేత పట్టుకున్న పోస్టర్‌ను ఆప్ విడుదల చేసింది. సినిమాలో హీరో గన్ పట్టుకున్నట్టు.. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్.. చీపురు పట్టుకున్నట్టు ఆ పోస్టర్ ను డిజైన్ చేశారు. అందుకు ధీటుగా బీజేపీ కూడా అవినీతిపై 'రప్పా రప్పా' పేరుతో పోస్టర్లు రిలీజ్ చేసింది. దీంతో ఢిల్లీ రాజకీయాల్లో ఇపుడు పుష్ప 2 మూవీ హాట్ టాపిక్ గా మారింది.
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.