Benefits Of Cherry Tomatoes News Health: మార్కెట్లో అందరూ టమాటోలు చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా చెర్రీ టమాటోలు చూశారా? ఈ టమాటో చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువ పులుపును కలిగి ఉంటాయి. నిజానికి వీటిల్లో మనం రోజు వినియోగించే టమాటోల కంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారాల్లో వినియోగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు తీవ్ర గుండె సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అయితే దీనిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకుంటే శరీరానికి కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
చెర్రీ టమాటోల ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యానికి చెక్:
ప్రతి రోజు చెర్రీ టమాటోలను తినడం వల్ల అందులో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి అందుతుంది. ఇది గుండెకు రక్షణ కవచంలా నిలుస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే రక్తనాళాలను ఆరోగ్యవంతంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు రక్తపోటును కూడా నియంత్రిస్తుందని.. దీని కారణంగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బ్యాడ్ కొలెస్ట్రాల్ మాయం:
క్రమం తప్పకుండా డైట్ల చెర్రీ టమాటోలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా సులభంగా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని కారణంగా గుండె కూడా శక్తివంతంగా తయారవుతుంది. అలాగే హార్ట్ఎటాక్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
క్యాన్సర్ సమస్యలకు చెక్:
చెర్రీ టమాటోల్లో ఉండే శక్తివంతమైన మూలకాలు లైకోపీన్ ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు కోలన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు పెరుగుతున్న క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తుంది.
చర్మ సమస్యలు మాయం:
చెర్రీ టమాటోలు రోజు తినడం వల్ల చర్మంపై సులభంగా ముడతలు తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని మరమ్మతులు చేసేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ర్రీ టమాటోల్లో ఉండే లైకోపీన్ సూర్యకాంతి నుండి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కూడా చర్మాన్ని కాపాడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.