Manchu Vishnu: మీ కుటుంబ వ్యవహారంతో సమాజంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించవద్దని మంచు విష్ణు(Manchu Vishnu)కు స్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు . ఇంకోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు దిగితే ఊరుకునేది లేదన్నారు. మరోసారి అలా చేస్తే బుక్కలే పడేస్తాం అని ఒకింత హార్ష్ గానే వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
సమస్యలు ఉంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి కానీ..గొడవలు చేయొద్దని సీపీ హెచ్చరించారు. కాదని గొడవకు దిగితే లక్ష రూపాయల ఫైన్‌తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు రాత్రి విచారణకు హాజరయ్యారు మంచువిష్ణు.
ఈ సందర్భంగా స్ట్రాంగ్ వార్నింగ్ తో పాటు మనోజ్ ఫిర్యాదుపై కూడా విష్ణును విచారించినట్లు తెలుస్తోంది. జల్ పల్లిలోని ఫాంహౌస్ నుంచి తన ప్రైవేట్ సెక్యూరిటీ ని బయటకు పంపించేయాలని విష్ణును ఆదేశించారు పోలీస్ కమిషనర్. జిల్లా అడిషనల్ మేజిస్ట్రేట్ హోదాలో శాంతి భద్రతల పరిరక్షణ నిబంధనల బాండ్ పై సైన్ తీసుకున్నారు సీపీ సుధీర్ బాబు. మంచు విష్ణు మొన్న జరిగిన విషయమై మీడియాతో మాట్లాడారు. తన తండ్రి తప్పు లేదని.. పెద్దాయన ఆవేశంలో అలా ప్రవర్తించారు. మీరు అర్ధం చేసుకోండన్నారు. మరోవైపు ఈ ఘటనలో మీడియా వ్యక్తిపై దాడి ఘటనలో మోహన్ బాబు పై పోలీసులు హత్నాయత్నం కేసు నమోదు చేసారు. మంచు విష్ణు.. ప్రస్తుతం కన్నప్ప సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. వచ్చే ఏప్రిల్ చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..
ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.