New Year Events: న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పేందుకు చాలా మంది ఇప్పటి నుంచే ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుందుకు మంచి డెస్టినేషన్ కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే హైదరాబాద్ లో కూడా కొత్త ఏడాది సెలబ్రేషన్స్ కోసం ఎన్నో రకాల ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నారు. సెలెబ్రిటీలు వచ్చి ఆడిపాడే ఈవెంట్స్ కూడా ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ ఈవెంట్స్ కు వెళ్లాలంటే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
మోహనా భోజరాజు ఈవెంట్
ఈ ఈవెంట్ కు వెళ్లాలంటే కాస్త ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఒకరికి టికెట్ 4,999 రూపాయలు ఉంటుంది. ఇందులో సింగర్ మోహన భోజరాజు లైవ్ షోతోపాటు నాన్ స్టాప్ మ్యూజిక్ డ్యాన్స్ కూడా ఉంటుంది. 21ఏళ్లు నిండినవారు మాత్రమే ఈఈవెంట్ లో పాల్గొనాలి. రాత్రి 8కి మొదలయ్యే ఈ షో కొత్త ఏడాది వచ్చే వరకు జరుగుతుంది. మాదాపూర్ లో ఉన్న రాస్తాలో ఈ ఈవెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్ తో వెళ్లేందుకు ఇది బెస్ట్ ఈవెంట్.
డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఈవెంట్
పుష్ప 2లో కిస్సిక్ పాటతో కుర్రవాళ్లను ఉర్రూతలూగించిన శ్రీలీల డ్యాన్సును లైవ్ లో చూడాలనుకుంటే నోవోటెల్ జరిగే ఈ ఈవెంటుకు వెళ్లండి. టికెట్ ధర రూ. 1400
సింగర్ కార్తీక్ ఈవెంట్
సింగర్ సునీత, సింగర్ కార్తీక్ 5 గంటల పాటు తమ పాటలతో మిమ్మల్ని ఉర్రూతలూగిస్తూ ఈ ఈవెంట్ సాగుతుంది. ఇది డిసెంబర్ 31 రాత్రి7 గంటలకు గచ్చిబౌలిలోని బోల్డర్ హిల్స్ లో జరుగుతుంది. ఒక్కో వ్యక్తికి 1699 రూపాయలు చెల్లించాలి.
రామ్ మిరియాల ఈవెంట్
డీజే టిల్లూ పాటతో అందర్నీ ఆకట్టుకున్న సింగర్ రామ్ మిరియాల న్యూ ఇయర్ ఈవెంట్ తో మళ్లీ ముందుకు వస్తున్నాడు. గౌలిదొడ్డిలో ఉండే ప్రిజమ్ క్లబ్ అండ్ కిచెన్ లో ఈ ఈవెంట్ జరుగుతుంది. దీనికి టికెట్ ధర 2499రూపాయలు
టికెట్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి?
పైన పేర్కొన్న ఈవెంట్స్ కు వెళ్లాలనుకుంటే ముందుగానే బుక్ మై షో వెబ్ సైట్లోకి వెళ్లి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వీటిని కొంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ ఈవెంట్లకు వెళ్లేందుకు ఎక్కువగా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.