Pushpa 2 movie controversy: పుష్ప2 మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను క్రియేట్ చేస్తుంది. అదే విధంగా దాదాపు మూడేళ్ల తర్వాత వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ వస్తున్నట్లు తెలుస్తొంది. అయితే.. పుష్ప2 సినిమా మాత్రం ఒకవైపు రికార్డుల పరంగా వార్తలలో ఉంటూనే.. మరొవైపు కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ గా మారిందని చెప్పుకొవచ్చు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ వెంటిలెటర్ మీద చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఈ ఘటన ఇప్పుడు పోలిటికల్ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తొంది. అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పుష్ప2 సినిమా రీలీజ్ నేపథ్యంలో అల్లు అర్జున్ తీరును తప్పు పడుతుండగా.. మరొవైపు బీఆర్ఎస్ ,బీజేపీలు మాత్రం రేవంత్ సర్కారు ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం పుష్ప2 వివాదం మాత్రం తెలుగు స్టేట్స్ లలోనే కాకుండా.. దేశంలో కూడా కాక రేపుతుందని చెప్పుకొవచ్చు.
అయితే.. పుష్ప2 మూవీ వల్ల ఇప్పటికే రెండు ప్రాణాలు పోయినట్లు తెలుస్తొంది. తాజాగా.. ఈ మూవీ కోసం మరో యువతి తన ప్రాణాలు అర్పించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తొంది. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో.. బనారస్ హిందు యూనీవర్సీటీలో కాలేజీలో చదువుతున్న యువతి తన బాయ్ ఫ్రెండ్ తో కలికి వెకెషన్ కు వారణాసికి వెళ్లింది. అక్కడ హోటల్ లో రూమ్ తీసుకున్నారు.
సదరు యువతి పుష్ప2 మూవీకి వెళ్దామని బాయ్ ఫ్రెండ్ కు చెప్పిందంట. కానీ అతను దీనికి ఒప్పుకోలేదంట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందంట. కోపంలో.. లాడ్జీలోని మూడో అంతస్థు నుంచి యువతి దూకేసిందంట. వెంటనే ఆమెను హోటల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారంట. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం యువతి పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. వీరు వారణాసికి వెళ్లడం ఆ కుటుంబాలకు ఎలాంటి సమాచారం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా పోలీసులు విచారణ జరుపుతున్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter