Shyam Benegal Passes Away: ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగాల్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల పడిలో తుది శ్వాస విడిచారు. అతడి మృతితో భారతీయ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోసహా సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినీ పరిశ్రమకు శ్యామ్ చేసిన సేవలను కొనియాడారు.
Also Read: Manchu Family: మంచు కుటుంబంలో మరో బిగ్ ట్విస్ట్.. విష్ణు చంపేస్తాడని మనోజ్ ఫిర్యాదు
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్ బెనెగల్ సోమవారం సాయంత్రం చికిత్స పొందుతూ ముంబైలో కన్నుమూశారు. అతడి మృతిని కుమార్తె పియా బెనగాల్ ధ్రువీకరించారు. 1934 డిసెంబర్ 14వ తేదీన హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో జన్మించిన శ్యామ్ బెనెగల్ భారతీయ సినీ దర్శకుడిగా.. చిత్ర రచయితగా గుర్తింపు పొందారు. చాలా మంది టీవీ సీరియల్స్‌లకు దర్శకత్వం వహించిన శ్యామ్ బెనగాల్ అనంతరం సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. అంకుర్, నిషాంత్, మంతన్, భూమిక సినిమాలతో భారతీయ సినీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించారు.
Also Read: Sritej Family: రేవంత్ రెడ్డి దెబ్బకు దిగివచ్చిన పుష్ప 2 నిర్మాతలు.. రేవతి కుటుంబానికి రూ.50 లక్షలు
అతడి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో శ్యామ్ బెనెగల్‌ను సత్కరించింది. 2013లో ప్రఖ్యాత అక్కినేని నాగేశ్వరరావు అవార్డు శ్యామ్ బెనెగల్‌కు లభించింది. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం అందుకున్నాడు. ఏడుసార్లు జాతీయ అవార్డులు అందుకోవడం విశేషం.
హైదరాబాద్‌లో జన్మించిన శ్యామ్ బెనగల్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ విద్యను అభ్యసించారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన శ్యామ్ బెనగల్ మూలాలు కర్ణాటకు చెందినవి. ఫొటోగ్రఫీపై మొదట ఆసక్తి ఉన్న శ్యామ్ అనంతరం సినిమాలపై దృష్టి మళ్లింది. అతడి తండ్రి కెమెరా గిఫ్ట్ ఇవ్వడంతో 12 ఏళ్లకే కెమెరా పట్టాడు. 1974లో అంకుర్ అనే సినిమా తీసి పరిశ్రమలో సంచలనం రేపారు. నిశాంత్, మంథన్, భూమిక, జునూన్, మండీ, త్రికాల్, అంతర్నాథ్ వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు.
పది రోజుల కిందట బర్త్‌డే
కాగా మృతికి పది రోజుల కిందటనే శ్యామ్ 90వ పుట్టినరోజును సినీ ప్రముఖుల మధ్య చేసుకున్నారు. డిసెంబర్ 14వ తేదీన కుల్‌భూషణ్ కర్బందా, నసీరుద్దీన్ షా, దివ్య దత్తా, శబానా అజ్మీ, రజిత్ కపూర్, అతుల్ తివారీ, కునాల్ కపూర్ తదితర సినీ ప్రముఖులతోపాటు స్నేహితులు, కుటుంబసభ్యులతో శ్యామ్ బెనగల్ జన్మదిన వేడుక జరుపుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.