Premi Vishwanth Son Photo Viral: కార్తీక దీపం సీరియల్ కోసం ఎంతగా ఎదురు చూసేవారంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఒక విధంగా చెప్పాలంటే ఈ సీరియల్ చూడటానికి మహిళలు తమ భర్తలతో కూడా గొడవలు పడీ మరీ చూసేవారు. అప్పట్లో ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఈ సీరియల్ అంతలా రికార్డ్ స్థాయిలో దూసుకుపోయింది. అయితే కార్తీకదీపం సీరియల్ సీజన్ 1 ముగించేశారు. ఆ తర్వాత కార్తీకదీపం 2 ఇది నవవసంతం అని సెకండ్ సీజన్ ను ప్రారంభించారు.
ఈ సీరియల్ 'స్టార్ మా' లో ప్రతిరోజు టెలికాస్ట్ అవుతుంది. ఈ సీరియల్ కూడా సీజన్ 1 మాదిరిగానే దూసుకుపోతుంది. అప్పటి వరకు టాప్‌లో ఉన్న 'బ్రహ్మముడి' సీరియల్‌ను సైతం వెనుకేసింది. ఇక కార్తిక దీపం 2 సీరియల్ టీఆర్పీ రేటింగ్‌లో మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. ఈ సీరియల్ ఇంతగా పేరు తీసుకురావడానికి ప్రధాన కారణం మళ్లీ వంటలక్కే. ప్రేమీ విశ్వనాథ్ ఈ సీరియల్లో 'దీప' క్యారెక్టర్ తో అందరినీ అలరిస్తుంది. ఇక కార్తీకదీపం 2 సీరియల్ లో ఆల్రెడీ పెళ్లయి ఒక కూతురు ఉన్న మహిళగా ఈమె క్యారెక్టర్‌ను రూపుదిద్దారు. ఈ సీరియల్లో కూడా నిరుపమ్ ' కార్తీక్ బాబు'గా నటించాడు. ఇక దీప వంటలక్కగా మళ్లీ ధనవంతుడైన కార్తీక్ బాబును పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రోడ్డున పడతారు. ప్రస్తుతం ఈ సీరియల్ మాటీవీలో టాప్‌లో దూసుకెళ్తుంది.
ఇదీ చదవండి: సంక్రాంతి సెలవులపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. ఎన్ని రోజులు తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!
ఇదిలా ఉండగా తాజాగా ప్రేమీ విశ్వనాథ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో పెద్దగా ప్రేమీ తన కుటుంబం గురించి ఎప్పుడు షేర్ చేయలేదు. ఈ వీడియోలో ప్రేమీ బాగా కండలు కలిగిన ఓ అబ్బాయితో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది. వాళ్ల చుట్టూ కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది. కొడుకు తనూ ఇద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో తెలుగులో ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ అచ్చ తెలుగులో ప్రేమీ విశ్వనాధ్ శుభాకాంక్షలు తెలిపింది. తన కొడుకుతోపాటు ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన నెట్టిజెన్లు అంత ఫిదా అవుతున్నారు. ఏంటి ? ఈ కండలు వీరుడు నీ కొడుకా ? అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నాడే... వంటలు అక్క కాదు 'సంతూర్ మమ్మీ' అంటూ కామెంట్లో పెడుతున్నారు. ఈ వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? చెప్పాల్సిందే అంటూ నెటిజెన్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.
ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ ఫోటోలు వైరల్.. బేబీ బంప్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook