టాలీవుడ్ సింగర్, తెలుగు బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి ఘటనలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం రాత్రి పబ్‌లో రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు బాటిల్స్‌తో దాడి జరగడం కలకలం రేపడం తెలిసిందే. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, ఆయనతో పాటు ఉన్న వ్యక్తులు రాహుల్‌పై బీరు బాటిల్స్‌తో దాడి చేయడంతో పాటు ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: చీఫ్ గెస్ట్‌గా కూతురు అర్హ: అల్లు అర్జున్ ఏమన్నారంటే!
దీనిపై రాహుల్ ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ముందుగా ప్రచారం జరిగినట్లుగానే ఈ గొడవ అమ్మాయిల విషయంలోనే జరిగిందని తెలుస్తోంది. రాహుల్ ఇద్దరు అమ్మాయిలు, మరికొందరు ఫ్రెండ్స్‌తో కలిసి పబ్‌కు వెళ్లాడు. ఆ ఇద్దరు మీడియాకు సంబంధించిన వారు కావడం గమనార్హం. ఇద్దరూ ప్రముఖ ఛానల్స్‌లో యాంకర్స్. కాగా అందులో ఒకరు రాహుల్‌కు బంధువు కాగా, మరొకరు సినిమా రిపోర్టర్, యాంకర్‌గా చేస్తున్నట్లు సమాచారం.
Also Read: రాహుల్ సిప్లింగంజ్‌పై దాడి చేసింది ఎవరు?
తన బంధువైన యాంకర్ ద్వారా ప్రముఖ ఛానల్లో పనిచేసే యాంకర్‌తో రాహుల్‌కు పరిచయమై ఫ్రెండ్ షిప్ మొదలైంది. వీరు తరచుగా పబ్‌లకు వెళ్తుండేవారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పబ్‌కు వెళ్లగా.. అక్కడ రితేష్ రెడ్డి ఓ యాంకర్‌పై కామెండ్ చేయడం, ఇది పద్ధతికాదని వారించిన కారణంగానే రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. తమపై కామెంట్ చేయడంతో తాను కూడా స్పందించి కొన్ని మాటలన్నానని మీడియాకు రాహుల్ చెప్పడం తెలిసిందే.
కేసు రాజకీయ రంగు పులుముకోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు ఎమ్మెల్యే సోదరుడు, మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలు రియాలిటీ షోలో విజేతగా నిలిపిన రాహుల్ సిప్లిగంజ్ కావడం అందరి నోళ్లలో ఇదే విషయం నానుతోంది.
అందాల భామ అనన్య లేటెస్ట్ ఫొటోలు